Advertisement

‘సర్కారు వారి పాట’ ఈ క్లారిటీ సరిపోతుందా?

Wed 23rd Sep 2020 06:02 PM
keerthi suresh,heroine,mahesh babu,parasuram,sarkaru vaari paata  ‘సర్కారు వారి పాట’ ఈ క్లారిటీ సరిపోతుందా?
Clarity about Sarkaru vaari paata Heroine ‘సర్కారు వారి పాట’ ఈ క్లారిటీ సరిపోతుందా?
Advertisement

పరశురామ్ - మహేష్ బాబు కలయికలో తెరకెక్కాల్సిన సర్కారు వారి పాట సినిమా త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతుంది. ఫస్ట్ షెడ్యూల్ అమెరికాలో చెయ్యాలని ప్లాన్ చేస్తుంది చిత్ర బృందం. దానికి సంబందించిన ఏర్పాట్లను మొదలు పెట్టారు. అయితే ఈ సినిమాలో ఎక్కువగా బాలీవుడ్ నటులను తీసుకోబోతున్నారనే న్యూస్ నడుస్తుంది. అనిల్ కపూర్‌ని మహేష్ విలన్‌గా సర్కారు వారి పాటలో ఫిక్స్ చేసారని.. ఇక మహేష్ బాబు అక్క పాత్రలో విద్యాబాలన్‌ని తీసుకోబోతున్నారని.. విద్యాబాలన్ పాత్ర సినిమాకే కీలకమని న్యూస్ నడుస్తుంది. అయితే ఈ సినిమాలో మహేష్‌కి హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ని ఫైనల్ చేసింది చిత్ర బృందం.

కానీ తాజాగా కీర్తి సురేష్ లుక్స్ పరంగా తేలిపోతుంది కాబట్టి ఆమెని సినిమా నుండి తప్పించారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అసలు కీర్తి సురేష్‌ని హీరోయిన్ అని మూవీ యూనిట్ ఇంతవరకు ప్రకటించలేదు. కీర్తి సురేష్ చెప్పిన మాటతోనే మహేష్ హీరోయిన్ ప్లేస్ కీర్తి అనుకున్నారు. అయితే పరశురామ్ కూడా కీర్తి సురేష్‌ని ఫైనల్ చేసేసాడు. అయితే సోషల్ మీడియాలో సర్కారు వారి పాట నుండి కీర్తి సురేష్‌ని తప్పించారని న్యూస్ నడిచినా మూవీ యూనిట్ ఖండించకపోయేసరికి ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.

అయితే తాజాగా సర్కారు వారి పాట హీరోయిన్ కీర్తి అని తెలుస్తుంది. కారణం సర్కారు వారి పాట ఫస్ట్ షెడ్యూల్‌ని అమెరికాలో ప్లాన్ చెయ్యడంతో.. కీర్తికి సంబందించిన యూఎస్ వర్క్ పర్మిట్ కొరకు చిత్ర యూనిట్ వీసా కోసం కూడా అప్లై కూడా చేశారట. దీనితో కీర్తి సురేష్‌నే సర్కారు వారి పాట హీరోయిన్ అని తేలిపోయింది అని అంటున్నారు.

Clarity about Sarkaru vaari paata Heroine:

Keerthi Suresh Heroine in Sarkaru vaari paata

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement