బిగ్ బాస్ లోకి వెళ్లొచ్చిన ప్రతి కంటెస్టెంట్ బయటికి రాగానే యూట్యూబ్ ఛానల్స్‌లో కూర్చుని బిగ్ బాస్ మీద హౌస్‌లోని కంటెస్టెంట్స్ మీద నానారకాల కామెంట్స్ చేస్తారు. కానీ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు కానీ.... అదే స్టేజ్ మీద ఎలిమినేట్ అయ్యి నాగ్ మాట్లాడమన్నప్పుడు కానీ.. బిగ్ బాస్ గురించి కంటెస్టెంట్స్ గురించి మాత్రం నెగెటివ్‌గా మాట్లాడరు. ఎందుకంటే మాట్లాడినా ఎడిటింగ్ చేస్తారనుకుంటారో.. హోస్ట్ ముందు బిగ్ బాస్‌ని తిట్టడం ఎందుకనుకుంటారో కానీ.. బిగ్ బాస్‌ని బిగ్ బాస్ స్టేజ్ మీద పల్లెత్తిమాట అనరు. కానీ స్టేజ్ దిగి జనజీవన స్రవంతిలో కలవగానే బిగ్ బాస్ అలాగా, బిగ్ బాస్ ఇలాగా. మనం చేసేది వేరు, చెప్పేది వేరు.. బిగ్ బాస్‌లో చూపించేది వేరు అంటూ రకరకాల కామెంట్స్ బిగ్ బాస్ మీద చేస్తారు.
బిగ్ బాస్ కండిషన్స్ ఒప్పుకునే కదా కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగుపెట్టేది. అన్ని ఒప్పుకున్నాక బిగ్ బాస్ అలా ఇలా అంటే ఎలా అంటున్నారు కొంతమంది నెటిజెన్స్. ఇక బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్న కొంతమంది కంటెస్టెంట్స్ ఇప్పుడు బిగ్ బాస్‌పై విరుచుకుపడుతున్నారు. వితిక సేరు బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక ఫ్రెండ్స్, బయటివారు మమ్మల్ని శత్రువుల్లా చూడడానికి బిగ్ బాస్ కారణం, బిగ్ బాస్‌లో కాంట్రవర్సీలు హైలెట్ అవుతాయి కానీ... ఫ్రెండ్ షిప్‌లు హైలెట్ కావు అంటూ మొదలెడితే దానికి శివ జ్యోతి, సీజన్ 3 కంటెస్టెంట్ గీత మాధురి సపోర్ట్ చేస్తున్నారు.
మరి బిగ్ బాస్‌లోకీ వారు బలవంతంగా పంపరు. పారితోషకాలకో, క్రేజ్ కోసమో... అందులో పాల్గొంటే సినిమా అవకాశాలు వస్తాయనో... ఏదైనా మీరు మీరుగానే బిగ్ బాస్‌కి వెళ్తున్నారు కానీ... ఎవరు బిగ్ బాస్‌లోకి బలవంతంగా అయితే తీసుకెళ్లరు. మరి బిగ్ బాస్‌కి కావల్సిన స్టఫ్‌నే ప్రేక్షకులకు ఇస్తారు. అంతేకాని కంటెస్టెంట్స్ కోరిక మేరకు వాళ్ళు అడిగింది వెయ్యరు కదా. ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయనుకున్న వాళ్ళు బిగ్ బాస్ హౌస్‌కి వెళ్ళకూడదు..ఇది మరో నెటిజెన్ మాట.