హోట‌ల్ బిజినెస్‌లో అడుగెట్టిన చైతూ నిర్మాతలు

Tue 22nd Sep 2020 02:24 AM
producers,sahu garapati,harish peddi,phani varma,shine screens,1980s military hotel,opening,details  హోట‌ల్ బిజినెస్‌లో అడుగెట్టిన చైతూ నిర్మాతలు
Shine Screens producers enters hotel business హోట‌ల్ బిజినెస్‌లో అడుగెట్టిన చైతూ నిర్మాతలు

హోట‌ల్ బిజినెస్‌లో అడుగు పెట్టిన షైన్ స్క్రీన్స్ అధినేత‌లు..

హోట‌ల్ బిజినెస్‌లో అడుగు పెట్టిన షైన్ స్క్రీన్స్ అధినేత‌లు.. ద‌ర్శ‌కులు అనిల్ రావిపూడి, శివ నిర్వాణ చేతుల మీదుగా గ్రాండ్‌గా ప్రారంభ‌మైన ‘‘1980స్ మిల‌ట‌రీ హోట‌ల్‌’’ (1980’s Military Hotel)

నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట‌గా ‘మ‌జిలీ’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని నిర్మించి, ప్ర‌స్తుతం నాని హీరోగా ‘ట‌క్ జ‌గ‌దీష్’ చిత్రాన్ని నిర్మిస్తోన్న‌ షైన్ స్క్రీన్స్‌ బ్యాన‌ర్ అధినేత‌లు సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది హోట‌ల్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. పాపుల‌ర్ డైరెక్ట‌ర్ సుధీర్ వ‌ర్మ సోద‌రుడు ఫ‌ణి వ‌ర్మ‌తో క‌లిసి హైద‌రాబాద్‌లో ‘‘1980స్ మిలట‌రీ హోట‌ల్‌’’ (1980’s Military Hotel)ను స్టార్ట్ చేశారు.

ఖాజ‌గూడ-నానక్‌రామ్ గూడ రోడ్డులో ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్ ద‌గ్గ‌ర ఏర్పాటు చేసిన ఈ హోట‌ల్‌ను సోమ‌వారం ఉద‌యం టాలెంటెడ్ డైరెక్ట‌ర్లు అనిల్ రావిపూడి, శివ నిర్వాణ చేతుల‌ మీదుగా ప్రారంభించారు. హోట‌ల్ పేరు వింటేనే నోరు ఊరుతోంద‌ని, త‌ప్ప‌కుండా ఈ హోట‌ల్‌కు మంచి పేరు వస్తుంద‌నే ఆశాభావాన్ని వారు వ్య‌క్తం చేశారు.

సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన, నోరూరించే తెలుగింటి రుచుల‌తో, అత్యంత ప‌రిశుభ్ర‌మైన, ఆరోగ్య‌క‌ర‌మైన‌ ఆహార ప‌దార్థాల‌ను త‌మ హోట‌ల్‌లో అందిస్తామ‌ని ‘‘1980స్ మిల‌ట‌రీ హోట‌ల్‌’’ య‌జ‌మానులు తెలిపారు.

Shine Screens producers enters hotel business:

Producers Sahu Garapati, Harish Peddi and Phani Varma’s 1980s Military Hotel opening details