సర్కారు వారి పాటలో బాలీవుడ్ నటి..?

Bollywood actress in Sarakru Vaari Paata..?

Wed 16th Sep 2020 11:48 AM
sarkaru vaari paata,mahesh babu,vidyabalan,parashuram,  సర్కారు వారి పాటలో బాలీవుడ్ నటి..?
Bollywood actress in Sarakru Vaari Paata..? సర్కారు వారి పాటలో బాలీవుడ్ నటి..?
Advertisement

సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మహేష్ బాబు, సినిమా షూటింగుని మరికొద్ది రోజుల్లో మొదలు పెట్టనున్నాడట. గీత గోవిందం సినిమాతో తన గీత మార్చుకున్న పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మాస్, క్లాస్ ప్రేక్షకులకి కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని దర్శకుడు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

కరోనా కారణంగా ఇప్పటి వరకూ మొదలు కాని షూటింగ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. మొన్నటికి మొన్న మహేష్ బాబు, యాడ్ షూట్ లో కనిపించడంతో సర్కారు వారి పాట చిత్రీకరణ తొందర్లోనే ఉంటుందని అభిమానులు నమ్ముతున్నారు. ఐతే కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ కనిపించనుందట.

ఒకానొక ముఖ్య పాత్రలో విద్యాబాలన్ ని తీసుకోవాలని చూస్తున్నారట. గతంలో విద్యాబాలన్ ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో కనిపించిన సంగతి తెలిసిందే. ఐతే సర్కారు వారి పాటలో విద్యాబాలన్ నటిస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతుందన్న వాదన నిజమయ్యేలా ఉంది. మరి ఈ విషయమై చిత్రబృందం అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

Bollywood actress in Sarakru Vaari Paata..?:

Bollywood actress in Sarakru Vaari Paata


Loading..
Loading..
Loading..
advertisement