బిగ్ బాస్: సెంటిమెంట్ బ్రేక్.. విజేతగా వాళ్ళే గెలుస్తారా..?

Bigg Boss.. First sentiment broke..

Mon 14th Sep 2020 09:29 PM
bigg boss telugu,suryakiran,nagarjuna,  బిగ్ బాస్: సెంటిమెంట్ బ్రేక్.. విజేతగా వాళ్ళే గెలుస్తారా..?
Bigg Boss.. First sentiment broke.. బిగ్ బాస్: సెంటిమెంట్ బ్రేక్.. విజేతగా వాళ్ళే గెలుస్తారా..?
Advertisement

బిగ్ బాస్ నాలుగవ సీజన్లో అందరూ కొత్త కంటెస్టెంట్లే కనిపించడంతో నిరాశ చెందిన అభిమానులు, ఇప్పుడిప్పుడే  మెల్ల మెల్లగా కనెక్ట్ అవుతున్నారు. కంటెస్టెంట్లు, వారి వారి అభిప్రాయాలతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మోడల్ దివిపై ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. సైలెంట్ గా ఉంటూనే గేమ్ ని పరిశీలిస్తున్న ఆమె తీరు అందరికీ బాగా నచ్చింది.

ఐతే మొదటి ఎలిమినేషన్ గా సూర్యకిరణ్ హౌస్ నుండి బయటకు వెళ్ళిన సంగతి తెలిసిందే. దీంతో బిగ్ బాస్ తెలుగు సీజన్లో మొదటి వారంలో ఎలిమినేట్ అయిన మొదటి మగాడిగా రికార్డుకెక్కాడు. ఇప్పటి వరకూ జరిగిన మూడు సీజన్లలోనూ మొదటి ఎలిమినేషన్ లో ఎలిమినేట్ అయ్యింది ఆడవాళ్లే. మొదటి సీజన్ లో జ్యోతి, రెండవ సీజన్లో సంజన, మూడవ సీజన్లో హేమ. ఇలా అందరూ ఆడవాళ్లే ఎలిమినేట్ అయ్యారు.

ఐతే ఈ సారి సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి ఫైనల్ లో ఆడవాళ్ళు విజేతలుగా నిలుస్తారా అన్న అనుమానం కలుగుతుంది. గత సీజన్లలో అందరూ మగవాళ్లే విజేతలుగా నిలిచారు. ఈ సారి మొదటి సెంటిమెంట్ బ్రేక్ అయిపోయింది కాబట్టి ఫైనల్ లో ఎప్పుడూ మగవాళ్లే గెలుస్తారనే సెంటిమెంట్ బ్రేక్ అయ్యి, ఆడవాళ్ళు గెలుస్తారా అని అనుమానం ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఒకవేళ అదే జరిగితే ఫైనల్ లో విజేతగా నిలిచే అమ్మాయి ఎవరో..

Bigg Boss.. First sentiment broke..:

Bigg Boss.. First sentiment broke..


Loading..
Loading..
Loading..
advertisement