ఇప్పుడు బాలీవుడ్, శాండిల్ వుడ్ డ్రగ్ కేసు దేశమంతా చర్చనీయాంశమైంది. డ్రగ్ కేసులో పలువురు హీరోయిన్స్ అరెస్ట్ లు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే బాలీవుడ్ శాండిల్ వుడ్‌లలో అరెస్ట్ అయిన హీరోయిన్స్ విషయంలో ఎన్సీబీ కేసు లోతుగా దర్యాప్తు చేస్తుందా? లేదా గతంలో టాలీవుడ్‌లో కూడా డ్రగ్స్ కేసు విషయం నీరు గార్చినట్టుగా నీరు గారుస్తురా? అనేది అందరిలో మెదులుతున్న అనుమానం. గతంలో టాలీవుడ్‌ని ఓ డ్రగ్ కేసు కుదిపేసింది. అందులో పలువురు ప్రముఖుల పేర్లు బయటికి రావడం ఆతర్వాత వారు విచారణకు హాజరవడం తదుపరి ఆ కేసు ఏమైందో అనేది ఇప్పటికీ మీడియాకి క్లారిటీ లేని ప్రశ్నే.
టాలీవుడ్‌లో పూరి జగన్నాధ్, రవితేజ, సుబ్బరాజు, ఛార్మి, నందు, నవదీప్ ఇంకా చాలామంది ఈ డ్రగ్ కేసులో విచారణను ఫేస్ చేశారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ మాదిరి బాలీవుడ్, శాండిల్ వుడ్ డ్రగ్ కేసుని ఎన్సీబీ నీరు కార్చదు కదా అంటూ అందరిలో హాట్ టాపిక్‌గా మారిన చర్చ. ప్రస్తుతం రియా, శాండిల్‌వుడ్‌లో రాగిణి ద్వివేది, సంజనల అరెస్ట్ లతో పాటుగా పలువురు ప్రముఖుల పేర్లు బయటికి వస్తున్నాయి. అందులో బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్, సౌత్ హీరోయిన్ రకుల్ పేరు బయటపడగా.. మరికొంతమంది పేర్లని రియా ఎన్సీబీ ముందు బయటపెట్టినట్టుగా ప్రచారం మొదలైంది.
అయితే రియా చెప్పిన రకుల్, సారాలని ఎన్సీబీ అరెస్ట్ చేస్తుందా అనేది అందరిలో ఆసక్తికర ప్రశ్నగా మారింది. లేదంటే బాలీవుడ్ లోను ఎవరైనా ఈ కేసుని పక్కదారి పట్టించిన ఆశ్చర్యపోవక్కర్లేదని అంటున్నారు. చూద్దాం ఈ డ్రగ్ కేసు టాలీవుడ్ లా కాకుండా ఏమైనా సంచలనాలు సృష్టిస్తుందేమో అనేది.