Advertisementt

‘ఆదిపురుష్’ విలన్‌తో ఆడుకుంటున్నారుగా..?

Sat 05th Sep 2020 11:28 PM
saif ali khan,aadipurush,villain,prabhas,trolling  ‘ఆదిపురుష్’ విలన్‌తో ఆడుకుంటున్నారుగా..?
Trolling on Aadipurush Villain Saif Ali Khan ‘ఆదిపురుష్’ విలన్‌తో ఆడుకుంటున్నారుగా..?
Advertisement
Ads by CJ

ప్రభాస్ ఆరడుగుల అందగాడు. మరి ప్రభాస్ విలన్ అంటే ఆరడుగులు ఉండక్కర్లేదు. కానీ ప్రభాస్‌కి సరిపోయే పర్సనాలిటీ కానీ, క్రేజ్ కానీ ఉండాలి. కానీ ప్రభాస్ ఓంరౌత్‌తో చెయ్యబోయే ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్ పక్కన చాలా చిన్నగా కనిపించే తానాజీ ఫేమ్ సైఫ్ అలీ ఖాన్ విలన్ ఏమిటా.. అనేది ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ముందున్న ప్రశ్న. సైఫ్ అలీ ఖాన్ ఒకప్పుడు బాలీవుడ్ టాప్ హీరో. తానాజీలో విలన్‌గా అదరగొట్టేసాడు. అందుకే ఓంరౌత్‌.. ప్రభాస్ ఆదిపురుష్ కోసం రావణ్ గా సైఫ్ అలీఖాన్ ని సెలక్ట్ చెయ్యడం,.. దాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది.

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆదిపురుష్ విలన్ రావన్ గా సైఫ్ అలీ ఖాన్ తేలిపోవడం ఖాయమని, అసలు ప్రభాస్ ముందు సైఫ్ ఎంత పెరఫార్మెన్స్ చేసిన ఆహార్యం పరంగా సరిపోడని, ఖచ్చితంగా తేలిపోతాడని అంటున్నారు. ప్రభాస్ కి విలన్ గా రావణ్ పాత్రకి ఏ అక్షయ్ కుమారో? లేదంటే అజయ్ దేవగన్ అయితే బావుండేది అంటూ సోషల్ ఇండియాలో ఆదిపురుష్ విలన్ పై ట్రోలింగ్ మొదలయ్యింది. 

ప్రభాస్ రాముడి గెటప్ లో, సైఫ్ అలీ ఖాన్ రావణ్ గెటప్ లో ఎదురెదురుగా కనబడితే.. ప్రేక్షకులు విజిల్స్ వెయ్యడం కాదు నవ్వుతారు అని అంటున్నారు. మరి బాలీవుడ్ లో ప్రభాస్ ఇప్పుడు ఆదిపురుష్ తో డైరెక్ట్ గా పాగా వెయ్యడాన్ని చాలామంది బాలీవుడ్ హీరోలు జీర్ణించుకోలేకపోతున్నారనేది బి టౌన్ టాక్. అలాంటిది ప్రభాస్ విలన్ గా క్రేజ్ ఉన్న హీరోలను అడిగితే వాళ్ళు ఒప్పుకోరు గనుకనే ఓంరౌత్ తానాజీ విలన్ సైఫ్ అలీ ఖాన్ రావణ్‌గా సరిపెట్టేసాడని అంటున్నారు.

Trolling on Aadipurush Villain Saif Ali Khan:

Saif Ali Khan Villain in Prabhas Aadipurush movie

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ