Advertisementt

మెగా పవర్ స్టార్ రెడీ అవుతున్నాడు..

Fri 28th Aug 2020 11:59 PM
ram charan,rrr,acharya,shooting,1st star hero,guest role  మెగా పవర్ స్టార్ రెడీ అవుతున్నాడు..
Ram Charan Ready to Acharya Movie Shooting మెగా పవర్ స్టార్ రెడీ అవుతున్నాడు..
Advertisement
Ads by CJ

ప్రస్తుతం హీరోలంతా షూటింగ్ కోసం వెళితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు. నిన్నటివరకు షూటింగ్ అంటే అమ్మో కరోనా అన్నారు. కానీ మిగతా భాషల హీరోలు షూటింగ్స్ కోసం బయలుదేరాక మన హీరోలు కాస్త ధైర్యం చేస్తున్నారు. అయితే టాలీవుడ్ లో అందరికన్నా ముందు రామ్ చరణ్ షూటింగ్ కి బయలుదేరేలా కనిపిస్తున్నాడు. హీరోలంతా లాక్‌డౌన్‌లో సినిమాల మీద సినిమాలు లైన్‌లో పెడుతుంటే చరణ్ మాత్రం కొత్త సినిమాల విషయంలో ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు. అయితే నిన్నమొన్నటివరకు షూటింగ్ అంటే అమ్మో అన్న చరణ్ ఇప్పుడు షూటింగ్స్ కి సన్నద్ధం అవుతున్నాడట. అయితే రామ్ చరణ్ నటిస్తున్న RRR కోసం రామ్ చరణ్ షూటింగ్ చెయ్యడానికి రెడీ కాలేదు.

ఆయన గెస్ట్ రోల్ చేస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ కోసం చరణ్ కరోనాని లెక్క చెయ్యను అని అంటున్నాడట. రాజమౌళి RRR లో ఫుల్ లెన్త్ రోల్ కాబట్టి.. ఎక్కువ రోజులు షూటింగ్ చెయ్యాలి. అదే ఆచార్య అయితే జస్ట్ గెస్ట్ రోల్ కాబట్టి కొన్ని రోజులు షూటింగ్ కి వెళితే సరిపోతుంది. అందుకే ముందు రామ్ చరణ్ ఆచార్య షూటింగ్ కి ఓకే చెప్పాడని.. RRR షూటింగ్‌లో తర్వాత పాల్గొంటానని రాజమౌళి దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మరి హీరోలందరిలో రామ్ చరణే కెమెరా ముందుకు రావడానికి రెడీ అవుతున్న ఫస్ట్ స్టార్ హీరో అని అప్పుడే వార్తలు మొదలయ్యాయి. 

Ram Charan Ready to Acharya Movie Shooting:

Not RRR.. Ram Charan ready for Acharya shoot

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ