బాహుబలి కోసం ఐదేళ్లు టైమ్, సాహో కోసం రెండేళ్ల టైమ్‌ని తీసుకున్న ప్రభాస్ ఇప్పుడు అస్సలు టైమ్ లేదంటున్నాడు. రాధేశ్యామ్‌తో పాటుగా మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టిన ప్రభాస్ ముందు వచ్చిన నాగ్ అశ్విన్ సినిమా కన్నా ఓం రౌత్ ఆదిపురుష్ మీదే ప్రభాస్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆదిపురుష్ స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ కాగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రాధేశ్యామ్, నాగ్ అశ్విన్ మూవీస్ తర్వాతే ప్రభాస్ ఓం రౌత్ ఆదిపురుష్ కోసం ఆలోచిస్తాడనుకుంటే.. కానీ ఇప్పటినుండే ఆదిపురుష్ కోసం రెడీ అవుతున్నాడు ప్రభాస్. ప్రభాస్ సహకరించడంతో ఓం రౌత్ కూడా చాలా స్పీడుగా ఆదిపురుష్ పనులను మొదలు పెట్టాడు.
ప్రీ ప్రొడక్షన్ మొదలు పెట్టడం తరువాయి.. కొన్ని ప్రముఖ అంతర్జాతీయ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలతో.. ఆదిపురుష్ టీం సంప్రదింపులు మొదలెట్టింది. ఎందుకంటే ఈ సినిమాలో విఎఫ్ఎక్స్‌కి చాలా ప్రాధాన్యం ఉంది. బడ్జెట్ లో సగం విఎఫ్ఎక్స్ ఖర్చు పెట్టబోతున్నారట. అంత బడ్జెట్ పెడుతున్నప్పుడు వరల్డ్ నెంబర్ వన్ విఎఫ్ఎక్స్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడానికి ఆదిపురుష్ టీం రంగంలోకి దిగింది. రాధేశ్యామ్ విడుదలకాకుండానే ఆదిపురుష్ పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నట్లుగా తాజా సమాచారం. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన సీత పాత్ర కోసం కియారా అద్వానీ, కీర్తి సురేష్ పేర్లు వినిపిస్తుండగా.. విలన్ పాత్రకి కేవలం సైఫ్ అలీఖాన్ పేరు మాత్రం వినిపిస్తుంది. మరి ఓం రౌత్ ఫైనల్ గా ఎవరిని ఎంపిక చేస్తాడో చూడాలి.