Advertisement

అభిమానులు హడావుడి చేయవద్దు: సుమన్

Thu 27th Aug 2020 08:14 AM
suman,request,birthday celebrations,actor suman  అభిమానులు హడావుడి చేయవద్దు: సుమన్
Actor Suman Request to His Fans అభిమానులు హడావుడి చేయవద్దు: సుమన్
Advertisement

ప్రస్తుతం ఉన్న కష్టకాలంలో ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని ప్రముఖ నటుడు సుమన్ తన అభిమానులకు సూచించారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ ప్రతి ఏడాది నా అభిమానులు కేకులు కట్ చేయడం, హడావుడి చేయడం చేస్తుంటారు. అయితే ఈసారి కరోనా కారణంగా ప్రజలు గుమికూడే పరిస్థితి లేదు. పైగా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే అభిమానులు హడావుడి చేయకూడదని సూచిస్తున్నాను. 

 

వీలైతే కరోనా నుండి ప్రజలను కాపాడటం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న డాక్టర్లకు, పోలీసులకు, వైద్య సిబ్బందికి అండగా ఉండాలని, వారికి సేవలు అందించాలని సుమన్ విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ కారణంగా తను ఇంటికే పరిమితం అయినట్టుగా సుమన్ తెలిపారు. తన నట జీవితంలో ఇలాంటి పరిస్థితులు, ఇన్ని రోజులు షూటింగ్ చేయకుండా ఉండలేదని  అన్నారు.  షూటింగ్‌లో పాల్గొనడానికి త్వరలోనే పరిస్థితులు అనుకూలంగా మారతాయని ఆశిస్తున్నాను. మధ్యలో నిలిచిపోయిన చిత్రాలను పూర్తిచేయాల్సి ఉందని సుమన్ పేర్కొన్నారు. 

Actor Suman Request to His Fans:

Suman talks about His birthday celebrations 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement