Advertisementt



‘ఆదిపురుష్’పై రాజమౌళి స్పందన ఇదే!

Mon 24th Aug 2020 07:51 PM
prabhas,ss rajamouli,adipurush,prabhas craze,young rebel star  ‘ఆదిపురుష్’పై రాజమౌళి స్పందన ఇదే!
SS Rajamouli Talks about Prabhas Adipurush ‘ఆదిపురుష్’పై రాజమౌళి స్పందన ఇదే!
Advertisement
Ads by CJ

ప్రభాస్‌తో బాహుబలి చేసిన రాజమౌళి ఏడాది గ్యాప్‌తో ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో RRR సినిమా చేస్తున్నాడు. కానీ ప్రభాస్ సాహో సినిమా చేసేశాడు. తర్వాత రాధేశ్యామ్, అలాగే నాగ్ అశ్విన్‌తో సినిమా.. తాజాగా ఓంరౌత్‌తో ఆదిపురుష్ సినిమా అనౌన్స్ చేశాడు. అయితే RRR షూటింగ్‌కి బ్రేకిచ్చిన రాజమౌళి కరోనా బారిన పడ్డాడు. ప్రభాస్ ఆదిపురుష్ ప్రకటించిన చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ పై బాహుబలి రాజమౌళి నోరు విప్పాడు. భారీ బడ్జెట్ ఆదిపురుష్ పై రాజమౌళి మాట్లాడడం చూస్తే సినిమాపై మరింత క్రేజ్, అంచనాలు పెరిగిపోయాయి.

ఆదిపురుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ తాను చాలా రోజుల క్రితమే చూశానని... ఆదిపురుష్ సినిమా రావడానికి ఇదే సరైన సమయమని... ఎందుకంటే ఈమధ్యనే ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నరేంద్ర మోడీగారి చేతుల మీదుగా రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగిందని... ఇండియాలో ఇప్పుడు రాముడి గురించి చర్చ జరుగుతోందని.... ఇటువంటి సమయంలో రాముడి మీద సినిమా వస్తే చాలా బాగుంటుందని అన్న రాజమౌళి.. బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ఇప్పుడు ఆదిపురుష్ సినిమాతో హీరో ప్రభాస్ స్థాయి మరింతగా పెరుగుతుందని రాజమౌళి అంటున్నాడు. మరి రాజమౌళి ఆదిపురుష్ పై ఇలా స్పందించడంపై ప్రభాస్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు.

SS Rajamouli Talks about Prabhas Adipurush:

Prabhas Craze doubled with Adipurush says SS Rajamouli

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ