Advertisementt

‘ఆదిపురుష్’ కోసం ప్రభాస్ ప్రయత్నాలు స్టార్ట్!

Sun 23rd Aug 2020 03:27 PM
prabhas,new look,adipurush,young rebel star  ‘ఆదిపురుష్’ కోసం ప్రభాస్ ప్రయత్నాలు స్టార్ట్!
Prabhas starts workouts for Adipurush ‘ఆదిపురుష్’ కోసం ప్రభాస్ ప్రయత్నాలు స్టార్ట్!
Advertisement
Ads by CJ

ప్రభాస్ బాహుబలి కోసం యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. గుర్రపు స్వారీ చేయడం దగ్గరనుండి విలు విద్య నేర్చుకుని బాణం వదలడం వరకు, అలాగే యుద్ధంలో శత్రుల కోసం కత్తిని తిప్పడం దగ్గరనుండి శత్రువులను మట్టుబెట్టే విద్యలను చాలానే నేర్చుకున్నాడు. బాహుబలి కోసం ఐదేళ్లు కష్ట పడ్డాడు. కాబట్టే ఒకే ఒక్క సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. బాహుబలి తర్వాత సాహో అనే యాక్షన్ మూవీ చేసిన ప్రభాస్ ఇప్పుడు రాధేశ్యామ్ అంటూ ఓ రొమాంటిక్ సినిమా చేస్తున్నాడు. తర్వాత నాగ్ అశ్విన్‌తో మరో సోషియో ఫాంటసీ మూవీకి రెడీ అవుతున్నాడు.

ఇక బాలీవుడ్ తానాజీ దర్శకుడు ఓంరౌత్‌తో ప్రభాస్ ‘ఆదిపురుష్’ అంటూ ఓ విజువల్ వండర్‌గా ఉండబోయే సినిమా ప్రకటించాడు. బాహుబలిగా అదరగొట్టిన ప్రభాస్ ఏ కేరెక్టర్‌లో అయినా ఇట్టే ఇమడగలడు. రోల్ ఎలాంటిది అయినా సరే ప్రభాస్ కటౌట్ అలా సరిపోతుంది. అందుకే ప్రభాస్‌ను తప్ప రామునిగా మరొకరి విజువల్ నాకు కనపడలేదని దర్శకుడు ఓంరౌత్‌ అంటున్నాడు. 

ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ మరోమారు కొన్ని కీలక యుద్ధ సన్నివేశాల కోసం విలు విద్య నేర్చుకోడానికి తనని తాను ట్రాన్సఫర్మెట్ చేసుకోనున్నాడని తెలుస్తుంది. అలాగే మంచి బాడీ ఫిట్నెస్ కోసం అప్పుడే ట్రైనర్ సమక్షంలో వర్కౌట్స్ కూడా చేస్తున్నాడట. ఇక ఎలాంటి గ్యాప్ రానివ్వకుండా ప్రభాస్ సినిమాల మీద సినిమాలు ప్రకటిస్తూ ఫ్యాన్స్‌ని ఖుష్ చేయనున్నాడు.

Prabhas starts workouts for Adipurush:

Prabhas New Look for Adipurush Movie

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ