Advertisement

మంచిరోజులు మరెంతో దూరంలో లేవు: చిరు

Sat 22nd Aug 2020 10:05 PM
ccc manakosam,mega star,chiranjeevi,press meet,chiranjeevi speech  మంచిరోజులు మరెంతో దూరంలో లేవు: చిరు
Chiranjeevi about CCC Helps To People మంచిరోజులు మరెంతో దూరంలో లేవు: చిరు
Advertisement

‘‘అందరికీ నమస్కారం. షూటింగ్స్ ఇంకా మొదలు కాలేదు, ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి. పనిలేక, చేతిలో డబ్బుల్లేక కష్టంగా ఉంది సినీ కార్మికుల పరిస్థితి. అందుకే సీసీసీ తరపున మూడోసారి కూడా అందరి కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చెయ్యాలని నిర్ణయిం తీసుకొని ఆల్రెడి పంపిణీ మొదలుపెట్టాము. ఇక్కడున్న అన్ని అసోసియేషన్లు, యూనియన్‌లు, సినీ జర్నలిస్టులతో పాటు ఆంధ్రాలో ఉన్న సినీ వర్కర్స్‌కి... ఎప్పటిలాగా ఇస్తూనే, ఈసారి రెండు రాష్ట్రాల్లోవున్న డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లోని రిప్రజంటేటివ్‌లకు, పోస్టర్ అతికించే కార్మికులకు కూడా అందివ్వాలని నిర్ణయం తీసుకొన్నాము. దాదాపుగా పదివేల మందికి అందివ్వడం జరుగుతుంది. అందరికి ఒక్క మాట... ఇప్పుడున్న ఈ పరిస్థితి శాశ్వతం కాదు.. తాత్కాలిక కష్టమే. మహా అయితే మరికొద్ది రోజులపాటు ఎదుర్కొని ధైర్యంగా నిలబడదాం. పని చేసుకొంటూ సంతోషంగా గడిపే రోజులు అతిదగ్గర్లోనే ఉన్నాయి. మీ కుటుంబానికి ముఖ్యంగా ఇప్పుడు కావలిసింది... మీ అందరి ఆరోగ్యం. మనకేం కాదులే, మనకేం రాదులే అన్న నిర్లక్ష్యం అస్సలు పనికి రాదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అనుక్షణం అప్రమత్తతో ఉంటూ మిమ్మల్ని మీరు రక్షించుకొంటూ మీ కుటుంబానికి రక్షణగా వుండండి.. ప్లీజ్. ఈ వినాయకచవితి పండుగ అందరూ సంతోషంగా జరుపుకొంటూ... ఈ క్లిష్ట పరిస్థితులనించి గట్టెక్కాలని మామూలు పరిస్థితులు నెలకొనాలని ఆ వినాయకుడికి మొక్కు కొందాం.

అందరికి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.....

మీ చిరంజీవి’’ జై హింద్ అని వీడియో బైట్‌ని రిలీజ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.

మెగాస్టార్ చిరంజీవిగారి సంకల్పంతో.. ప్రోత్సాహంతో  ప్రారంభమైన సీసీసీ కమిటీ ద్వారా మూడో విడతగా బియ్యంతో పాటు పలు రేషన్ సామాన్లు అందజేస్తున్నామని దర్శకుడు ఎన్..శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా కార్మికులు షూటింగ్స్ లేకుండా ఇబ్బందులకి గురవుతుండటంతో వారి ఇబ్బందులు తీర్చేందుకు చిరంజీవిగారు ఈ సీసీసీ మనకోసం ఛారిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. హీరోలందరూ కలిసి సీసీసీ కోసం విరాళాలు అందించారు. సీసీసీ గురించి ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టి స్పెషల్‌గా ఎప్పుడు చెప్పలేదు. మొదటిసారి సీసీసీ విషయమై ప్రెస్ మీట్ పెట్టామని చెప్పారు. ఇప్పటికే రెండు సార్లు రేషన్ సామాన్లు ఇచ్చారు. లాక్ డౌన్ టైంలో ఎవరూ బయటికి రాలేని పరిస్థితిలో సీసీసీ కమిటి చిరంజీవిగారు.. డి..సురేశ్ బాబు గారు.. నాగార్జున గారు.. ముఖ్యంగా మెహర్ రామేశ్ గారు.. బెనర్జీగారు.. భరద్వాజ్‌గారు.. సి.కల్యాణ్‌గారు.. దాము గారు.. వారు తీసుకున్న బాధ్యతలని సంపూర్ణంగా నెరవేర్చి లాక్‌డౌన్ సమయంలో ఒక కుటుంబానికి నెలకు సరిపడా  నిత్యావసర వస్తువులను వారి వారి ఇళ్ళకి చేర్చారు. దాదాపు 13,500 కుటుంబాలకి ఈ వస్తువులను అందించాం. సెకండ్ ఫేజ్‌లో కూడా పదివేల మందికి అందించాం. థర్డ్ ఫేజ్ మొదలుపెట్టాం. దాదాపు 11వేల మందికి ఈ కిట్‌లు అందజేశాం. అట్లాగే వైజాగ్.. రాజమండ్రి.. తిరుపతికి సంబంధించిన సినిమా కార్మికులతో పాటు అలాగే రెండు రాష్ట్రాలలోని సినిమా థియేటర్స్ రిప్రజెంటీవ్స్ మరియు ఫేస్టింగ్ బాయ్స్‌కి కూడా ఈ కిట్‌లను అందజేశాం. ఈసారి వినాయక చవితి సీసీసీ కిట్‌లతో ఉద్దేశ్యంతో బెల్లం.. బియ్యం పిండి.. సేమియా ఇట్లాంటి పండగకి సంబంధించిన వస్తువులను అందజేశాం. మీ అందరి సపోర్ట్‌తో.. ముఖ్యంగా దాతల ఔదార్యం, వారి మంచి మనసు, ఎక్కడా మిస్ యూజ్ జరగకుండా అందజేయడం వారికి తృప్తినిచ్చింది. అవసరమైతే చిరంజీవిగారు నాలుగవసారి పంపిణీ చేయడానికి కమిటీతో మాట్లాడి నిర్ణయం తీసుకోనున్నారు. మీ అందరిని కలవడం సంతోషం..మీ అందరికి వినాయకచవితి శుభాకాంక్షలు అని తెలిపారు.

తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీ అందరి తరపున గాన గంధర్వుడు బాలసుబ్రమణ్యం‌గారు అనారోగ్యం నుంచి కోలుకొని మళ్ళీ ఆయన పాటలు పాడి అందరినీ అలరించాలని కోరారు. బాలు గారు అందరికీ ఆత్మీయులే. సంగీతాన్ని ప్రేమించే ప్రతి వారు ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారని.. సీసీసీ తరపున.. మీడియా తరపున కూడా ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పారు. వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా లాక్ డౌన్ అనగానే ఏం చేద్దామని ఆలోచించి సీసీసీ ఆలోచన చిరంజీవిగారికి వచ్చింది. రెండు విడతలు అనుకున్నది మూడు అయింది. ఈ నేపథ్యంలో చిరంజీవిగారు నాలుగవ విడత కూడా ఇద్దాం అనుకున్నాం. ఈసారి రిప్రజెంటీవ్స్.. పోస్టర్స్ బాయ్స్‌కి కూడా ఇచ్చాం. ఆంధ్రాలో సినిమా టెక్నిషియన్స్‌కి కూడా ఇచ్చాం. మాకు చేతనయిన సాయం చేశాం. చిరంజీవి సంకల్పంతో దాతలు ముందుకురావడంతో ఈ పని సాధ్యమైందని చెప్పారు. మెహర్ రమేశ్.. స్వయంగా ఇంటి ఇంటికి వెళ్ళి మెహెర్ బాబా ట్రస్ట్ వాలంటీర్లు సాయమందించడం విశేషం. మెహర్ ట్రస్ట్ వాళ్ళే ఇప్పుడు పంపిణి చేస్తున్నారు. కరోనా టైంలో కూడా రిస్క్ తీసుకుని 50కిలోల బరువు భుజాలపై మోస్తూ ఇంటింటికి ఇచ్చారు. వారి రుణం తీర్చుకోలేనిదని అన్నారు.

మెహర్ రమేశ్ మాట్లాడుతూ.. అందరికీ ఒక ధైర్యం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో సీసీసీ రూపాంతరం చెందిందని చెప్పారు. భరధ్వాజగారిని.. సి కళ్యాణ్, దామూ గారిని.. కమిటీని మార్కెట్ గిడ్డంగుల చుట్టూ తిప్పాం. ఆడీ కార్లు వదిలి స్వచ్ఛందంగా వచ్చిన దాతలు కూడా ఉన్నారు. ఏ ఏరియాని వదలకుండా మన వర్కర్ అడ్రస్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఇచ్చాము. చిరంజీవిగారి, భరద్వాజ్ గారి ఇంట్లో ఏం తింటారో అవే నాణ్యత దినుసులు మిల్స్ నుంచి తెప్పించాం. మంచి క్వాలిటీ సరకులను అందించాం. చిరంజీవిగారు ప్రతి నిమిషం ఫోన్ చేసి ఎవరెవరికి చేరవేశామో అడిగేవారు. సీసీసీ అనుకోగానే నాగార్జునగారు, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, నాని తదితరులందరూ ఈ ట్రస్ట్‌కి విరివిగా  విరాళాలు అందించారు. శ్రీహరి ట్రేడర్స్ మాకం ఆంజనేయులుగారు మంచి క్వాలిటీతో పాటు తక్కువ రేటుకే ఈ సరుకులను అందించారు. ఈ కరోనా టైంలో సహాయమందించేందుకు బయటికి వెళ్ళడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాం.. అన్నారు. 

బెనర్జీ మాట్లాడుతూ.. చిరంజీవిగారికి ఇలాంటి మంచి ఆలోచన రావడం సినీ ఇండస్ట్రీతో పాటు చిరంజీవిగారి ఫ్యాన్స్.. బయటివారు కూడా సీసీసీకి విరాళాలు అందించడం విశేషం. 95 పర్సెంట్ సినీ ఇండస్ట్రీ వారే దాతలుగా ముందుకొచ్చారు. భరద్వాజ్ గారు, మెహర్ రమేశ్ గారు, మెహర్ బాబా ట్రస్ట్ వారు చేసిన సేవ ఎనలేనిదని కొనియాడారు. డిజిటల్ టీం రామకృష్ణ కూడ ఎంతో సేవ చేశారు. చివరిగా అందరి తరపున చిరంజీవిగారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Chiranjeevi about CCC Helps To People:

CCC Manakosam Press Meet Details 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement