Advertisement

కరోనా బారిన మరో తెలుగు దర్శకుడు..!

Thu 13th Aug 2020 07:01 AM
ajay bhupathi,rx 100,telugu,rajamouli,amitab bachchan,covid19,coronavirus  కరోనా బారిన మరో తెలుగు దర్శకుడు..!
Telugu director tests Covid 19 positive.. కరోనా బారిన మరో తెలుగు దర్శకుడు..!
Advertisement

ప్రస్తుతం దేశమంతా అన్ లాక్ దశలో ఉంది. ఒక్కొక్కటిగా అన్ లాక్ అవుతున్న  తరుణంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. వారు.. వీరు.. అని ఎలాంటి తేడా లేకుండా అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తూ విస్తరించుకుంటూ వెళ్తుంది. కరోనా కారణంగా సినిమా షూటింగులు ఆపేసుకుని ఇంట్లోనే కూర్చుంటున్నా కరోనా ప్రభావం ఆగట్లేదు. ఇప్పటికే చాలా మంది ఫిలిం సెలెబ్రిటీలు కరోనా బారిన పడ్డారు.

అమితాబ్ బచ్చన్ కుటుంబమంతా కరోనా బారిన పడి ఆ తర్వాత కోలుకున్నారు. టాలీవుడ్ లో రాజమౌళి కుటుంబం కరోనా బారిన పడింది. తాజాగా ఈ కుటుంబం కరోనాని జయించింది. ఇంకా డైరెక్టర్ తేజ, గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, తెలుగు పాప్ సింగర్ స్మిత కరోనా బారిన పడ్డారు. వీరందరూ మెల్లమెల్లగా కోవిడ్ నుండి కోలుకుంటున్నారు. అయితే తాజాగా మరో టాలీవుడ్ డైరెక్టర్ కి కరోనా సోకింది.

ఆర్ ఎక్స్ 100 సినిమాతో సంచలనం సృష్టించిన అజయ్ భూపతికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ధృవీకరించిన అజయ్, త్వరలో వస్తా, ప్లాస్మా ఇస్తా అంటూ మెసేజ్ పెట్టాడు.  

Telugu director tests Covid 19 positive..:

Telugu director tests Covid 19 positive

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement