Advertisement

మెట్రో కథలు.. టీజర్ వదిలిన ఆహా..

Sun 09th Aug 2020 08:42 AM
aha,metro kathalu,karuna kumar,allu aravind,web series telugu  మెట్రో కథలు.. టీజర్ వదిలిన ఆహా..
Metro Kathalu teaser release.. మెట్రో కథలు.. టీజర్ వదిలిన ఆహా..
Advertisement

వెబ్ సిరీస్ లకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో తెలుగులో చాలా సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. వందశాతం తెలుగు కంటెంట్ ని అందిస్తున్న ఆహా వేదిక ఈ సిరీస్ లని తెరకెక్కించే పనిలో చాలా బిజీగా ఉంది. తాజాగా ఆహా నుండి మెట్రో కథలు టైటిల్ తో వెబ్ సిరీస్ రూపొందింది. ప్రముఖ జర్నలిస్ట్ ఖదీర్ బాబు రచించిన కథలని తీసుకుని మెట్రో కథలు గా తీర్చిదిద్దారు. పలాస ఫేమ్ కరుణ కుమార్ ఈ సిరీస్ కి దర్శకత్వం వహించారు.

తాజాగా ఈ సిరీస్ టీజర్ ని విడుదల చేసింది ఆహా టీమ్. నిమిషం కూడా లేని ఈ టీజర్ లో కథేంటనేది అర్థం కాకపోయినా నాలుగు కథల్లో పాత్రలన్నీ ఏదో ఒక విషయమై ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్టు కనబడుతున్నారు. వారి జీవితంలో బాధ, దుఃఖం మొదలగు వాటినే చూపిస్తుందని అర్థం అవుతుంది. రాజీవ్ కనకాల, బిగ్ బాస్ ఫేమ్ ఆలీ రెజా, నందినీ రాయ్ తదితరులు ప్రధాన పాత్రలుగా కనిపిస్తున్న ఈ సిరీస్ ఆగస్టు 14వ తేదీ నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవనుంది.

click here for teaser

Metro Kathalu teaser release..:

Metro Kathalu teaser release..

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement