Advertisementt

సూర్య ‘వాడివాసల్‌’ లుక్ ఇదే!

Fri 24th Jul 2020 07:15 PM
singam suriya,vaadivaasal,vetrimaaran,kalaippuli s thanu,look,release  సూర్య ‘వాడివాసల్‌’ లుక్ ఇదే!
Singam Suriya VaadiVaasal Movie Look Released సూర్య ‘వాడివాసల్‌’ లుక్ ఇదే!
Advertisement
Ads by CJ

సింగం సూర్య హీరోగా వెట్రిమారన్‌ ద‌ర్శ‌క‌త్వంలో క‌లైపులి ఎస్. థాను సెన్సేష‌న‌ల్ మూవీ ‘వాడివాసల్‌’.

సింగం సూర్య హీరోగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వెట్రిమారన్‌ ద‌ర్శ‌క‌త్వంలో క‌లైపులి ఎస్. థాను నిర్మిస్తున్న చిత్రం  ‘వాడివాసల్‌’. హీరో సూర్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల ‌చేసిన ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ధ‌నుష్,  క‌లైపులి ఎస్. థాను, వెట్రిమారన్ కాంభినేష‌న్‌లో  వ‌చ్చిన అసుర‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా  శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో నార‌ప్ప‌గా తెర‌కెక్కిస్తున్నారు. ఇప్పుడు ప్ర‌ముఖ ర‌చ‌యిత సీఎస్‌ చెల్లప్ప రాసిన నవల ఆధారంగా జల్లికట్టు నేపథ్యంలో వాడివాసల్ చిత్రం తెరకెక్కనుంది.  సూర్య, వెట్రిమారన్‌ కాంభినేష‌న్‌లో ప్రె‌స్టీజియ‌స్‌గా రూపొందుతోన్న ఈ మూవీ మా బేన‌ర్‌లో మ‌రో సెన్సేష‌న‌ల్ సినిమా కాబోతుంద‌ని నిర్మాత  క‌లైపులి ఎస్. థాను అన్నారు. ఈ సినిమాకు సంబందించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేయ‌నున్నారు.

సింగం సూర్య హీరోగా న‌టిస్తో న్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: ఆర్‌. వేల్‌రాజ్‌, సంగీతం: జి.వి. ప్ర‌కాశ్‌, ఆర్ట్‌: జాకీ, నిర్మాత‌: క‌లైపులి ఎస్. థాను, ద‌ర్శ‌క‌త్వం: వెట్రిమారన్.

Singam Suriya VaadiVaasal Movie Look Released:

Singam Suriya’s Sensational Movie ‘VaadiVaasal’ In Vetrimaaran’s Direction Is Produced By Kalaippuli S Thanu

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ