Advertisementt

ఆ ఒక్క మాటతో పిచ్చెక్కించాడుగా..

Sun 19th Jul 2020 05:33 PM
nag ashwin,prabhas21,deepika padukone  ఆ ఒక్క మాటతో పిచ్చెక్కించాడుగా..
Nag Ashwin interesting tweet about Prabhas21 ఆ ఒక్క మాటతో పిచ్చెక్కించాడుగా..
Advertisement
Ads by CJ

ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాపై జనాల్లో ఆసక్తి బాగా నెలకొంది. టైమ్ ట్రావెలర్ అంటూ వస్తున్న వార్తలు.. క్లాస్ డైరెక్టర్, మాస్ హీరో.. క్రేజీ కాంబినేషన్ పట్ల ఆసక్తి ఈ సినిమాపై అంచనాలని  బాగా పెంచింది. అయితే ఈ సినిమా నుండి తాజాగా అప్డేట్ వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించనుందని అధికారికంగా ప్రకటించారు.

అయితే ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన నాగ్ అశ్విన్, కింగ్ కి సరిపడేంత క్వీన్ కావాలి కదా మరి.. చాలా ఆలోచించి తీసుకున్న డెసిషన్ ఇది.. పిచ్చెక్కిద్దాం అంటూ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. పిచ్చెక్కిద్దాం అనే ఒక్క మాట సినిమాపై అంచనాలని మరింత పెంచింది. ఎప్పుడూ చాలా నెమ్మదిగా, కూల్ గా కనిపించే నాగ్ అశ్విన్ ఇలా మాట్లాడేసరికి ఒక్కసారిగా అందరి అటెన్షన్ అతని మీదే పడింది. నాగ్ అశ్విన్ లో అంత హుషారు దాగుందని ఎవ్వరూ ఊహించలేదు. మరి పాన్ వరల్డ్ సినిమా అంటే ఆమాత్రం ఉండాల్సిందే..

Nag Ashwin interesting tweet about Prabhas21:

Nag Ashwin interesting tweet about Prabhas21

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ