పాయల్ రాజ్‌పుత్ ఇప్పుడు అవకాశాల కోసం అర్రులు చాచుతుంది. ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా చేతిలో ఉన్న పాయల్ రాజ్‌పుత్. ఇప్పుడు తన కోరికల చిట్టాని బయటపెడుతోంది. తాను హిందీ సీరియల్స్ తోనే నటనకు పరిచయమయ్యా అని.. హిందీ సీరియల్స్ లో నటించేటప్పుడే తనకి పంజాబీ, తెలుగు సినిమా అవకాశాలు వచ్చాయని చెబుతుంది. అయితే తెలుగులో RX 100 తర్వాత వెంకటేష్ ‘వెంకిమామ’, రవితేజ ‘డిస్కో రాజా’లలో చేసినా బ్రేక్ తెచ్చుకోలేని పాయల్ రాజ్‌పుత్‌కి రవితేజ అంటే చాలా ఇష్టమట. అసలు టాలీవుడ్‌లో తనకి రవితేజ, ప్రభాస్ లంటే చాలా ఇష్టమని.. విజయ్ దేవరకొండ, ప్రభాస్ లతో నటించాలనేది తన డ్రీం అని చెబుతుంది. ప్రభాస్ అంటే పాన్ ఇండియా స్టార్, విజయ్ దేవరకొండకి పిచ్చ క్రేజుంది. అలాంటిది వాళ్లతో నటించడానికి ఏ హీరోయిన్స్ అయినా సై అనడమే కాదు.. ఆశ కూడా పడతారు.
ప్రస్తుతం హిట్స్ లేని పాయల్ రాజ్‌పుత్‌కి విజయ్ దేవరకొండ, ప్రభాస్ సినిమాల్లో అవకాశాలంటే కల అంటుంది. అది కలగానే మిగులుతుందో లేదంటే అవకాశాలేమన్న వస్తాయో చూడాలి. తొందరలోనే ప్రభాస్, విజయ్ దేవరకొండలతో నటించాలనే తన కల నెరవేరుతుంది అని చెబుతుంది. ఇక తనకి హీరోయిన్స్ అందరిలో తమన్నా అంటే ఇష్టమని చెబుతుంది పాయల్. RX 100 తనకి ఎంతో నచ్చిన సినిమా అని, ఆ సినిమా ఒప్పుకుని మంచి పని చేశా అని, ఆ సినిమాలో నటించడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది.





గ్యాప్ ఇవ్వలా.. బ్లాక్‌బస్టర్ తర్వాత వచ్చిందంతే..!

Loading..