Advertisement

ఇలియానా గాలి వీచ‌డం లేదు!

Wed 08th Jul 2020 09:29 AM
ileana,craze,bollywood,tollywood,ileana movies,ileana cinema career,actress ileana  ఇలియానా గాలి వీచ‌డం లేదు!
No Craze to Ileana in Telugu Film Industry ఇలియానా గాలి వీచ‌డం లేదు!
Advertisement

ఉవ్వెత్తున ఎగ‌సిప‌డిన అల అంత‌లోనే చ‌ల్ల‌బ‌డిపోతుంద‌ని ఎవ‌రూ అనుకోలేదు. కానీ ఆ అల అలాగే ప‌డిపోయింది. త‌న వ‌య్యారాల్ని తొలినాళ్ల‌లో అద్భుతంగా ప్ర‌ద‌ర్శించిన ఆ తార మ‌ళ్లీ ఎప్ప‌టికైనా మునుప‌టి ఉత్తుంత త‌రంగంలా దూసుకు వ‌స్తుంద‌ని ఇప్ప‌టికీ ఆమె ఆరాధ‌కులు ఆశిస్తూనే ఉన్నారు. ఆ అల‌.. ఇలియానా! వైవీఎస్ చౌద‌రి తీర్చిదిద్దిన ‘దేవ‌దాసు’తో గ్రాండ్‌గా తెరంగేట్రం చేసి, పూరి జ‌గ‌న్నాథ్ రూపొందించిన ‘పోకిరి’తో యువ హృద‌యాల్ని కిరికిరి చేసి, తెలుగు చిత్ర‌రంగంలో హాటెస్ట్ హీరోయిన్‌గా అవ‌త‌రించిన ఆమె ఆ త‌ర్వాత వేసిన అడుగులు ప‌ట్టుత‌ప్పాయి.

రవితేజ స‌ర‌స‌న చేసిన ‘ఖ‌త‌ర్నాక్’ ఒక పీడ‌క‌ల‌గా నిలిచింది. కృష్ణ‌వంశీ ‘రాఖీ’ ప‌రువునిలిపినా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప‌ట్టువిడిచింది. ప్ర‌భాస్‌తో చేసిన ‘మున్నా’దీ అదే దారి. అభిన‌వ సిమ్రాన్‌గా విమ‌ర్శ‌కుల చేత ప్ర‌శంస‌లు పొంది, యువ‌త‌రంలో అమిత అభిమానాన్ని సంపాదించిన ఓ తార అంత‌లోనే మాయ‌మ‌వుతుందేమోన‌నే సందేహం క‌లిగింది విశ్లేష‌కుల్లో. అంత‌లో వ‌చ్చింది ‘ఆట‌’. త‌న లావ‌ణ్యంతో వెండితెర‌ని ఓ ఆట ఆడించేసింది ఇలియానా. ఆమె త‌డిత‌డి అందాల్ని చూసి, యువ‌త‌రానికే కాదు, వ‌య‌సుమ‌ళ్లిన వాళ్ల‌కే మ‌తులు పోయాయి. కాపీ సినిమాగా పెద‌వి విర‌చిన విమ‌ర్శ‌కుల ప్ర‌చారాన్ని త‌ట్టుకొని ‘ఆట’ ఆడిందంటే, ఆ సినిమాలో ఇలియాను చూసేందుకే ప్రేక్ష‌కులు మ‌ళ్లీ మ‌ళ్లీ రావ‌డం కార‌ణం.

అప్ప‌ట్లో టాప్ ర్యాంక్‌లో ఉన్న త్రిష‌కు ప‌క్క‌లో బ‌ల్లెంలా మారింది ఇలియానా. త్రివిక్ర‌మ్ డైరెక్ట్ చేసిన ‘జ‌ల్సా’లో ప‌వ‌న్ క‌ల్యాణ్ జోడీగా అద‌ర‌గొట్ట‌డంతో త్రిష‌ను దాటేస్తుంద‌ని అంద‌రూ ఆశించారు. ‘భ‌లేదొంగ‌లు’ ఓ మోస్త‌రుగా ఆడినా, ర‌వితేజ‌తో న‌టించిన ‘కిక్’ సినిమా ఆమెను టాప్ హీరోయిన్‌ను చేసింది. ఆ సినిమాలో ఇలియానా యోగా భంగిమ‌లు కుర్ర‌కారు మ‌తులు పోగొట్టాయి. అలాంటి టైమ్‌లో స్క్రిప్టుల విష‌యంలో జాగ్ర‌త్త ప‌డ‌కుండా చేసిన రెచ్చిపో, స‌లీమ్, శ‌క్తి, నేను నా రాక్ష‌సి సినిమాలు ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా దారుణ ప‌రాజయాన్ని అందించాయి. అల్లు అర్జున్ స‌ర‌స‌న చేసిన ‘జులాయి’ వ‌చ్చి ఆమెను తిరిగి రేసులో నిలిపింది.

అప్పుడే త‌న కెరీర్ దిశ‌ను మార్చే నిర్ణ‌యం తీసుకుంది ఇలియానా. అది.. బాలీవుడ్‌కు వెళ్లాల‌ని. టాలీవుడ్‌లో ఎన్ని సినిమాలు చేసినా త‌న గుర్తింపు ఇక్క‌డికే ప‌రిమిత‌మ‌వుతుంద‌ని అనుకుందేమో హిందీలో ర‌ణ‌బీర్ క‌పూర్‌తో ‘బ‌ర్ఫీ’ సినిమా చేసింది. అందులో సెకండ్ హీరోయిన్‌గా చేసిన‌ప్ప‌టికీ, సినిమా సూప‌ర్ హిట్ట‌వ‌డంతో ఇలియానాకు మంచి గుర్తింపే ల‌భించింది. ఈలోపు తెలుగులో విడుద‌లైన ‘దేవుడు చేసిన మ‌నుషులు’ మూవీ డిజాస్ట‌ర్ అయినా ఆమె పెద్దగా క‌ల‌త చెంద‌లేదు. తెలుగులో వ‌చ్చిన ఆఫ‌ర్ల‌ను వ‌దులుకొని హిందీ సినిమాల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం ఆమె చేసిన పొర‌పాటుగా విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ‌తారు. హిందీలో వ‌రుస‌గా సినిమాలైతే చేసింది కానీ, ఏనాడూ టాప్ లీగ్‌లోకి ఆమె ప్ర‌వేశించ‌లేక‌పోయింది. అపురూప లావ‌ణ్య‌రాశిగా పేరుపొందిన ఇలియానా ప్ర‌భ మ‌స‌క‌బార‌డం మొద‌లైంది.

ఫ‌టా పోస్ట‌ర్ నిఖ్‌లా హోగా, మై తేరా హీరో, హ్యాపీ ఎండింగ్‌, రుస్తోమ్‌, ముబార‌క‌న్‌, బాద్‌షాహో, రెడ్ వంటి సినిమాలు చేసినా ఆమె కీర్తి పెర‌గ‌లేదు. ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌చందంగా ఆమె ప‌రిస్థితి మారిపోయింది. ఈలోపు సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయాయి. తెలుగువాళ్లు ఆమెను దాదాపు మ‌ర‌చిపొయ్యారు. అప్పుడు టాలీవుడ్ గుర్తుకొచ్చింది అమ్మ‌డికి. పాత స్నేహితుడు ర‌వితేజ‌తో నాలుగోసారి జోడీక‌ట్టి ‘అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని’లో న‌టించింది. అది డిజాస్ట‌ర్! ఆ త‌ర్వాత హిందీలో చేసిన ‘పాగ‌ల్‌పంతి’ మ‌రో డిజాస్ట‌ర్‌!! ఇప్పుడు ఒక‌ప్ప‌టి స్టాక్ బ్రోక‌ర్ హ‌ర్ష‌ద్ మెహ‌తా జీవితం ఆధారంగా రూపొందుతోన్న ‘బిగ్ బుల్’ మూవీలో అభిషేక్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి న‌టిస్తోంది ఇలియానా. కానీ ఆనాటి మెరుపులు ఆమెలో క‌నిపించ‌డం లేద‌నేది చాలామంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఒక్కోసారి తీసుకున్న నిర్ణ‌యం కెరీర్‌ను డౌన్ చేస్తుందనేందుకు ఇలియానా ఉదంత‌మే ఓ ఉదాహ‌ర‌ణ‌. ఎలాంటి స్థితిలో ఉండాల్సిన మెరుపుక‌న్య ఎలాంటి స్థితిలో ఉంది?!

No Craze to Ileana in Telugu Film Industry:

Ileana Fadeout Heroine in Both Industries

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement