ఆ రీమేక్ లో వెంకటేష్ అంటున్నారేంటి..?

Is Venkatesh Playing a role in that remake..?

Tue 07th Jul 2020 10:39 AM
venkatesh,rana daggubati,ak,ayyappanum koshiyum,ravi teja  ఆ రీమేక్ లో వెంకటేష్ అంటున్నారేంటి..?
Is Venkatesh Playing a role in that remake..? ఆ రీమేక్ లో వెంకటేష్ అంటున్నారేంటి..?
Advertisement

గత కొన్ని రోజులుగా తెలుగు నిర్మాతలంతా మళయాల చిత్రాల రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. మళయాలంలో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలని తెలుగులో రీమేక్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే లూసిఫర్, అయ్యప్పనుమ్ కోషియం, కప్పెలా, డ్రైవింగ్ లైసెన్స్, హెలెన్ వంటి చిత్రాల రీమేక్ హక్కులని దక్కించుకున్నారు. అయితే ఈ వరుసలో ఉన్న రెండు మళయాల చిత్రాలైన అయ్యప్పనుమ్ కోషియం, కప్పెలా చిత్రాలని హక్కులని సితార ఎంటర్ టైన్ మెంట్స్ దక్కించుకుంది.

అయ్యప్పనుమ్ కోషియం సినిమా కోసం డైరెక్టని వెతికే పనిలో ఉన్న సితార టీమ్ హీరోలని ఫైనలైజ్ చేసిందని అంటున్నారు. ఇద్దరు మనుషుల ఇగోల వల్ల పరిస్థితులు ఏ విధంగా మారతాయన్న కథాంశంతో వచ్చిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాలో రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేష్ నటించనున్నారని అంటున్నారు.

అయితే మొన్నటికి మొన్న రానాతో పాటు రవితేజ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ సడెన్ గా వెంకటేష్ పేరు బయటకి వచ్చింది. ప్రస్తుతం వెంకటేష్ నారప్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో ఎఫ్ 3 సినిమా చేయాల్సి ఉంది. మరి ఈ నేపథ్యంలో వెంకటేష్ ఈ రీమేక్ లో నటిస్తాడా లేదా అన్నది సందేహంగా మారింది. అధికారిక ప్రకటన వస్తేనేగానీ ఈ విషయంలో క్లారిటీ రాదు. కానీ వెంకటేష్, రానా కలిసి సినిమా ఆ సినిమా రేంజే మారిపోతుంది.

Is Venkatesh Playing a role in that remake..?:

Is Venkatesh Playing a role in that remake..?


Loading..
Loading..
Loading..
advertisement