ఆర్ ఆర్ ఆర్ పై అంచనాలు మరింత పెంచేసాడుగా..

Madan Karky revealed interesting stories about RRR

Mon 06th Jul 2020 10:58 AM
rrr,rajamouli,ntr,ram charan,keeravani  ఆర్ ఆర్ ఆర్ పై అంచనాలు మరింత పెంచేసాడుగా..
Madan Karky revealed interesting stories about RRR ఆర్ ఆర్ ఆర్ పై అంచనాలు మరింత పెంచేసాడుగా..
Advertisement

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తుంది. బాహుబలి సినిమా ద్వారా భారతీయ చలన చిత్రపరిశ్రమని మరో స్థాయికి తీసుకువెళ్ళిన రాజమౌళి, ఆర్ ఆర్ ఆర్ తో మరో మెట్టు ఎక్కించడానికి రెడీ అవుతున్నాడు. నిజ జీవిత పాత్రలని తీసుకుని కల్పిత కథగా రూపొందిస్తున్న ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే తాజాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి తమిళంలో మాటలు, పాటలు రాస్తున్న చెప్పిన విషయాలు ఈ సినిమాపై అంచనాలని ఆకాశంలోకి తాకేలా చేసాయి. ఒకానొక ఇంటర్వ్యూలో మదన్ కార్కీ మాట్లాడుతూ, ఆర్ ఆర్ ఆర్ చిత్రం బాహుబలి కంటే పదిరెట్లు ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుందని, బాహుబలి సినిమాలో గూస్ బంప్స్ ఇచ్చే సన్నివేశాలు పది పన్నెండు దాకా ఉంటే, ఈ సినిమాలో అంతకుమించి ఉన్నాయని చెబుతున్నాడు.

ముఖ్యంగా దేశభక్తి గురించిన సీన్లు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయట. అయితే ఈ సినిమాలో డైలాగులు షార్ట్ గా ఉంటాయట. కానీ అవి చాలా తీవ్రంగా, ఆలోచింపజేసేవిగా ఉండనున్నాయట. మొత్తానికి రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాపై ఉన్న అంచనాలని మరింత పెంచుతూ ఎప్పుడెప్పుడు సినిమాని రిలీజ్ చేస్తారా అని ఎదురుచూసేలా చేసాడు. 

Madan Karky revealed interesting stories about RRR:

Madan Karky revealed interesting stories about RRR


Loading..
Loading..
Loading..
advertisement