నితిన్ పవర్ పేటలో మరో హీరో..

Another Hero in NIthin Powerpeta..!

Sat 04th Jul 2020 11:44 AM
nithin,krishna chaitanya,satyadev,bluff master,  నితిన్ పవర్ పేటలో మరో హీరో..
Another Hero in NIthin Powerpeta..! నితిన్ పవర్ పేటలో మరో హీరో..
Advertisement

నితిన్ హీరోగా తెరకెక్కిన భీష్మ చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి చివర్లో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావాల్సిందే. కానీ అన్ సీజన్ కావడంతో సూపర్ హిట్ తో సరిపెట్టుకుంది. అయితే భీష్మ తర్వాత నితిన్ ఒప్పుకున్న సినిమాల్లో రంగ్ దే చిత్రం ఆల్రెడీ కొద్ది భాగం షూటింగ్ జరుపుకుంది.

రంగ్ దే తో పాటు అతడి చేతిలో మరో మూడు సినిమాలున్నాయి. అందులో ఛల్ మోహనరంగ దర్శకుడు క్రిష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవర్ పేట కూడా ఒకటి. ఛల్ మోహనరంగ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ క్రిష్ణ చైతన్యకి మరో మారు అవకాశం ఇచ్చాడు. అయితే  ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది.

ఈ సినిమాలో నితిన్ తో పాటు మరో హీరో కూడా నటించబోతున్నాడు. అతనెవరో కాదు.. ముందుగా చిన్న చిన్న పాత్రల్లో కనిపించి, ఆ తర్వాత జ్యోతిలక్ష్మీ సినిమాతో మంచి హిట్ అందుకుని, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా చిన్న చిన్న పాత్రల్లో మెరిసి, బ్లఫ్ మాస్టర్ సినిమాతో హీరోగా మారిన సత్యదేవ్. హీరోగా మారినప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ సినిమాలు ఒప్పుకుంటున్నాడు.  మరి నితిన్ పవర్ పేటలో అతడి పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.  

Another Hero in NIthin Powerpeta..!:

Another Hero in NIthin Powerpeta..!


Loading..
Loading..
Loading..
advertisement