గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో అల్లు శిరీష్!

Allu Sirish accepts green India challenge, plants saplings

Sun 05th Jul 2020 06:53 AM
allu sirish,nominates,nephew and nieces,green challenge  గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో అల్లు శిరీష్!
Allu Sirish accepts green India challenge, plants saplings గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో అల్లు శిరీష్!
Advertisement

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా హీరో విశ్వ‌క్ సేన్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు తన ఇంటి గార్డెన్‌లో మొక్కలు నాటారు హీరో అల్లు శిరిష్.

ఈ సందర్భంగా శిరీష్ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్ప‌డున్న జీవన‌విధానంలో ప‌ర్య‌ావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ అత్యంత అవ‌స‌రం. అందుకే విధిగా మ‌నంద‌రం స్వ‌చ్ఛందంగా మొక్క‌లు నాటాల‌ని కోరుతున్నాను. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా విశ్వ‌క్ సేన్ నాకిచ్చిన ఛాలెంజ్‌ను స్వీక‌రించి నా మేన‌ల్లుడు ఆర్నావ్ మేన‌కోడ‌ల్లు అన్విత‌, స‌మారా, నివ్రితిల‌ను ఈ కార్య‌క్ర‌మానికి నామినేట్ చేస్తున్నాను. రానున్న కొత్త త‌రానికి చెట్ల‌ను, ఏ విధంగా నాటాలి, పెంచాల‌నే విష‌యం తెలియ‌డం చాలా అవ‌స‌ర‌మ‌ని అన్నారు. అందుకే త‌న మేన‌ల్లుడు, మేన‌కోడ‌ల్ల‌కి ఈ ఛాలెంజ్ స్వీక‌రించాల్సిందిగా నామినేట్ చేస్తున్న‌ట్లు తెలిపారు. అల్లు శిరీష్ ప్ర‌స్తుతం త‌న త‌దుప‌రి సినిమాకి సంబంధించిన కార్య‌క్ర‌మాల్లో ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రాబోతుంది.

Allu Sirish accepts green India challenge, plants saplings:

Allu Sirish nominates His nephew and nieces for Green Challenge 


Loading..
Loading..
Loading..
advertisement