అల్లు అర్జున్ లుక్‌లో నో ఛేంజ్..!

No Change in Allu Arjun Look

Sat 04th Jul 2020 06:28 PM
allu arjun,lockdown,look,stylish star,allu arjun look,pushpa movie  అల్లు అర్జున్ లుక్‌లో నో ఛేంజ్..!
No Change in Allu Arjun Look అల్లు అర్జున్ లుక్‌లో నో ఛేంజ్..!
Advertisement

‘అల వైకుంఠపురములో’ చిత్రంలో మిడిల్ క్లాస్ కుర్రాడిగా అల్లు అర్జున్ చిన్నపాటి గడ్డం, రఫ్ హెయిర్ స్టయిల్‌తో చాలా సాదా సీదా లుక్ లో కనిపించాడు. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ సుకుమార్‌తో పుష్ప అంటూ పాన్ ఇండియాకి వెళ్లబోతున్నాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ రఫ్‌గా లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. పుష్ప ఫస్ట్ లుక్‌లోనే అల్లు అర్జున్ గుబురు గెడ్డం, రఫ్ హెయిర్ స్టయిల్, లుక్ లోను చాల రఫ్‌గా కనిపించాడు. జుట్టు కూడా గోల్డ్ కలర్‌గా చాలా రఫ్ లుక్‌లో అల్లు అర్జున్ పుష్పలో కనిపించనున్నాడు. అయితే లాక్ డౌన్ కారణంగా ఇంకా పట్టాలెక్కని పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ ఇప్పటికే లుక్ టెస్ట్ తో పాటుగా.. చిన్నపాటి పనులను కూడా పూర్తి చేసాడు.

అయితే లాక్ డౌన్ లో తన ఫ్యామిలీతోనే టైం గడుపుతున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం అంటే లాక్ డౌన్ మూడు నెలల పదిహేను రోజుల్లో ఏమన్నా లుక్ మార్చాడేమో అని మెగా ఫాన్స్ చూస్తున్నారు. కానీ అల్లు అర్జున్ పుష్ప కోసం ఎలా మేకోవర్ అయ్యాడో అలానే ఉన్నాడు. తాజాగా అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహతో కలిసి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్‌లో జాగింగ్ చేయడానికి వచ్చాడు. అక్కడ బన్నీ పుష్ప మేకోవర్‌లోనే ఉన్నాడు. హెయిర్ పెంచి.. చిన్న పిలక వేసుకుని, రఫ్‌గా ఉన్న గెడ్డంతోనే కనబడుతున్నాడు. అంటే అల్లు అర్జున్ లుక్ మార్చలేదు. పుష్ప లుక్‌నే కంటిన్యూ చేస్తున్నాడు అంటే.. కరోనా ఉధృతి తగ్గగానే పుష్ప సెట్స్‌పై కెళ్లడానికి అనువుగానే ఉన్నాడు. 

No Change in Allu Arjun Look:

Allu Arjun lockdown look goes viral 


Loading..
Loading..
Loading..
advertisement