భానుమ‌తి అండ్ రామ‌కృష్ణపై తలసాని ప్రశంసలు!

Talasani Srinivas Yadav Praises Bhanumati and Ramakrishna

Sat 04th Jul 2020 10:36 AM
bhanumati and ramakrishna,naveen chandra,ott release,talasani,aha  భానుమ‌తి అండ్ రామ‌కృష్ణపై తలసాని ప్రశంసలు!
Talasani Srinivas Yadav Praises Bhanumati and Ramakrishna భానుమ‌తి అండ్ రామ‌కృష్ణపై తలసాని ప్రశంసలు!
Advertisement

ప్ర‌తికూల క‌రోనా స‌మ‌యంలో ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోన్న భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు:  సినిమాటోగ్ర‌ఫీ మినిస్ట‌ర్ త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్‌ 

‘అందాల రాక్ష‌సి’ నుండి న‌టుడిగా త‌న‌ను తాను కొత్తగా ఆవిష్క‌రించుకుంటూ వ‌స్తున్న న‌వీన్ చంద్ర హీరోగా స‌లోని లూథ్రా హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘భానుమ‌తి అండ్‌ రామ‌కృష్ణ‌’. నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై శ‌ర‌త్ మరార్ స‌మ‌ర్ప‌ణ‌లో క్రిషివ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై య‌శ్వంత్ ములుకుట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ డిఫ‌రెంట్ ల‌వ్ జ‌ర్నీని శ్రీకాంత్ నాగోతి తెర‌కెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో పెట్టుకు ప్రారంభ‌మైన ప‌క్కా తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘ఆహా’. తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందిన పక్కా తెలుగు ఓటీటీ ‘ఆహా’ ద్వారా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘భానుమతి అండ్ రామ‌కృష్ణ‌’ సూపర్‌హిట్ కంటెంట్‌తో అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా రూపొందింద‌ని అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో హీరో న‌వీన్ చంద్ర‌, చిత్ర స‌మ‌ర్ప‌కుడు శ‌ర‌త్ మ‌రార్‌, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ నాగోతి, నిర్మాత య‌శ్వంత్ ములుకుట్ల త‌దిత‌రులు తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మినిస్ట‌ర్ త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌ను ప్ర‌త్యేకంగా క‌లిశారు. చిత్ర‌యూనిట్‌ను త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ ప్ర‌త్యేకంగా అభినందించారు. 

ఈ సంద‌ర్భంగా సినిమాటోగ్ర‌ఫీ మినిస్ట‌ర్ త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ మాట్లాడుతూ - ‘‘నవీన్ చంద్ర హీరోగా యంగ్ టీమ్ చేసిన ప్రయత్నమే ఈ ‘భానుమతి అండ్ రామకృష్ణ’. ఓ మంచి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ నాగోతి, నిర్మాత యశ్వంత్ ములుకుట్ల, సమర్పకుడు శరత్ మరార్‌గారిని అభినందిస్తున్నాను. అల్లు అరవింద్‌గారికి సంబంధించిన ఆహా ఓటీటీలో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో పనిచేసిన హీరో, హీరోయిన్స్ సహా ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు. ప్రస్తుతం కరోనా వల్ల చిత్ర పరిశ్రమ చాలా సమస్యలను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా విడుదలకు సిద్ధమైన సినిమాలను థియేటర్స్లో విడుదల చేసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలు ఓటీటీల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో సినిమా రంగానికి సంబంధించిన సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తూనే ఉంది. ఆహా యాప్‌లో వచ్చిన ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు.

Talasani Srinivas Yadav Praises Bhanumati and Ramakrishna:

Bhanumati and Ramakrishna Released in Aha Ott


Loading..
Loading..
Loading..
advertisement