బుల్లితెరపైకి హాస్యబ్రహ్మా..?

Bramhanandam coming with comedy serial..?

Fri 03rd Jul 2020 02:10 PM
bramhanandam,telugu,television,comedian,telugu film industry  బుల్లితెరపైకి హాస్యబ్రహ్మా..?
Bramhanandam coming with comedy serial..? బుల్లితెరపైకి హాస్యబ్రహ్మా..?
Advertisement

ఒక సినిమా చూస్తున్నప్పుడు అరే.. ఇందులో కమెడియన్స్ ఎవరూ లేరా అనే అడిగారంటే వారు ఖచ్చితంగా తెలుగు సినిమాలు చూసే వాళ్లే అయ్యుంటారు. ఒక సినిమాలో హీరో, హీరోయిన్ కి ఎంత ప్రాధాన్యం ఉంటుందో కమెడియన్ కి కూడా అంతే ప్రాధాన్యం ఉందంటే అది ఖచ్చితంగా తెలుగు సినిమానే. అందుకే తెలుగులో కమెడియన్లు చాలా ఎక్కువ. అయితే కమెడియన్లందరిలోకి తనకంటూ స్టార్ స్టేటస్ తెచ్చుకున్న వారిలో బ్రహ్మానందం ప్రథముడు. 

సినిమా ఏదయినా బ్రహ్మానందం ఉన్నారంటే ఆ క్రేజే వేరు. థియేటర్ లో హీరోకే కాదు కమెడియన్ల కి ఈలలు వేస్తున్నారంటే దానిక్కారణం బ్రహ్మానందమే. అయితే కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఎంతగానో నవ్వించిన బ్రహ్మానందం, గత కొన్ని రోజులుగా ఎక్కువగా సినిమాలు ఒప్పుకోవడం లేదు. ఆనారోగ్య కారణాల వల్ల సినిమాలకి కొన్ని రోజులు దూరంగా ఉన్నారని అన్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం బ్రహ్మానందం బుల్లితెరపైకి వస్తున్నాడట. కామెడీ సీరియల్ తో ప్రేక్షకులని నవ్వించడానికి రెడీ అవుతున్నాడట. అదే నిజమైతే బుల్లితెర ప్రేక్షకులకి పండగే అని చెప్పాలి. అయితే ఈ విషయమై మరికొద్ది రోజుల్లో అధికారిక సమాచారం రానుందని అంటున్నారు. 

Bramhanandam coming with comedy serial..?:

Bramhanandam coming with comedy serial..?


Loading..
Loading..
Loading..
advertisement