కరోనా: బాలయ్య చెప్పిందే జరుగుతుంది!

Corona Effect : No Shooting in Tollywood

Sat 04th Jul 2020 03:55 AM
balakrishna,corona,tollywood,shootings,chiranjeevi,telugu film industry  కరోనా: బాలయ్య చెప్పిందే జరుగుతుంది!
Corona Effect : No Shooting in Tollywood కరోనా: బాలయ్య చెప్పిందే జరుగుతుంది!
Advertisement

కరోనా లాక్‌డౌన్‌తో మార్చ్ 20 నుంచి సినిమా షూటింగ్స్‌కి బ్రేకులు పడ్డాయి. తిరిగి ఎప్పుడు మొదలవుతాయో తెలియదు కానీ... మళ్లీ సినిమా షూటింగ్స్ ప్రారంభించడానికి  ఇండస్ట్రీలో పెద్ద తలకాయలైన చిరంజీవి, రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, నాగార్జునలాంటి వాళ్ళు సమావేశాలు జరిపి.. తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి మరీ షూటింగ్స్ కి అనుమతులు తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వం నియమ నిబంధనలతో షూటింగ్స్ జరుపుకోవచ్చని, ముందు ట్రయిల్ షూట్ కి అనుమతులనిచ్చింది. అయితే ఈ తతంగం అంత చూసిన బాలకృష్ణ నన్ను ఎవరు కరోనా మీటింగ్స్‌కి పిలవలేదని రచ్చ లేపాడు. దానితో బాలయ్యకి ఫేవర్‌గా కొంతమంది, వ్యతిరేకంగా కొంతమంది ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చలకు తెరలేపారు.

అయితే పెద్దలంతా కలగజేసుకుని షూటింగ్స్ కోసం అనుమతులు తీసుకొచ్చినంత మాత్రాన సినిమా షూటింగ్స్ మొదలవ్వలేదు. ప్రస్తుతం కరోనా వలన సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇబ్బందుల్లో పడింది. మళ్లీ సినిమా ఇండస్ట్రీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇకనుండి మనం అనుకున్నట్టుగా షూటింగ్స్ కానీ, బడ్జెట్స్ కానీ ఉండవు అంటూ బాలయ్య మాట్లాడిన మాటలు ఇప్పుడు నిజమయ్యేలా ఉన్నాయి. చిరు వాళ్ళు షూటింగ్స్ కి అనుమతులు తెచ్చి.. కామ్‌గా ఉన్నారు. మరి హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో కరోనా పెరుగుతుండటంతో మళ్లీ హైదరాబాద్ లాక్‌డౌన్ అంటున్నారు. మరి ఇప్పటికి హీరోలెవరు సెట్స్ మీదకి రావడానికి సిద్ధంగా లేరు. ఎవరికి వారే కరోనా తగ్గాకే షూటింగ్స్ మొదలెట్టాలి అన్నట్టుగా ఉన్నారు. కరోనా ముందు ఎవరైనా ఒక్కటే అన్నట్టుగా ఉంది కరోనా వ్యవహారం. 

Corona Effect : No Shooting in Tollywood:

Balakrishna Speaks about Corona comes True


Loading..
Loading..
Loading..
advertisement