తేజ‌స్వి ‘క‌మిట్‌మెంట్’ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల!

Tejaswi madivada COMMITMENT poster released

Fri 03rd Jul 2020 04:42 AM
commitment,tejaswi madivada,laxmikanth chenna,telugu  తేజ‌స్వి ‘క‌మిట్‌మెంట్’ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల!
Tejaswi madivada COMMITMENT poster released తేజ‌స్వి ‘క‌మిట్‌మెంట్’ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల!

తేజస్వి మాదివాడ తెలుగు సినిమాల్లో హీరోయిన్ పక్కన చిన్న చిన్న పాత్రల్లో మెరిసి, ఆ తర్వాత హీరోయిన్ గా మారినా సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కానీ బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా వచ్చిన తేజస్వి చాలా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటున్న తేజస్వి అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంది. అయితే తాజాగా తేజస్వి హీరోయిన్ గా నటిస్తున్న సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది.

‘క‌మిట్‌మెంట్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజస్వి మాదివాడ, రమ్య పసుపులేటి, సిమర్ సింగ్ ఇంకా అన్వేషి జైన్ ప్రధాన పాత్రలు పోషించారు. కథా ప్రకారం సినీ రంగంలో అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలకి ఎదురయ్యే అనుభవాలని ‘క‌మిట్‌మెంట్’ సినిమా ద్వారా చూపించనున్నారట. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా నుండి తేజస్వి లుక్ బయటకి వచ్చింది.

నేడు తేజస్వి పుట్టినరోజు సందర్భంగా ‘క‌మిట్‌మెంట్’ చిత్రం నుండి పోస్టర్ ని రిలీజ్ చేసారు. పోస్టర్ లో తేజస్విని మరింత అందంగా కనిపించింది. సినిమాల్లోకి రావాలనుకునే వారి జీవితంలో మనకి తెలియని కోణాన్ని చూపించబోతున్న ఈ సినిమా ద్వారా అయినా తేజస్వి హిట్ అందుకుంటుందేమో చూడాలి. లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది.

Tejaswi madivada COMMITMENT poster released:

Tejaswi madivada COMMITMENT poster released