భానుమతి రామక్రిష్ణ టైటిల్ మార్పు..?

Bhanumati Ramakrishna tirle changed..?

Thu 02nd Jul 2020 02:53 PM
naveen chandra,saloni luthra,bhanumati ramakrishna  భానుమతి రామక్రిష్ణ టైటిల్ మార్పు..?
Bhanumati Ramakrishna tirle changed..? భానుమతి రామక్రిష్ణ టైటిల్ మార్పు..?
Advertisement

నవీన్ చంద్ర హీరోగా సలోని లుత్రా హీరోయిన్ గా తెరకెక్కిన భానుమతి రామక్రిష్ణ చిత్రం రేపటి నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవనున్న సంగతి తెలిసిందే. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి అనుకోని ఆటంకం ఎదురైంది. సాధారణంగా రొమాంటిక్ కామెడీ చిత్రాల్లో పెద్దగా వివాదాస్పద అంశాలేమీ ఉండవు. కానీ ఈ సినిమాకి టైటిల్ వల్లనే వివాదం చెలరేగింది. 

అలనాటి హీరోయిన్ భానుమతి రామక్రిష్ణ గారి పేరుని వాడుకున్నారంటూ భానుమతి గారి కుమారుడు చెన్నై కోర్టులో పిటిషన్ వేసాడు. దాంతో కోర్టు ఈ సినిమా పేరుని మార్చాలంటూ ఆదేశాలు జారీ చేసిందట. అయితే ప్రస్తుతం ఈ సినిమా పేరుని భానుమతి రామక్రిష్ణ కి బదులుగా భానుమతి అండ్ రామక్రిష్ణగా మార్చనున్నారని తెలిసింది. రేపు రిలీజ్ కాబోయే చిత్రానికి ఈరోజు పేరు మార్చడం కొంచెం వింతగా అనిపించినా తెలుగు చిత్రపరిశ్రమలో ఇలా చాలా సార్లు జరిగింది.

Bhanumati Ramakrishna tirle changed..?:

Bhanumati Ramakrishna tirle changed..?


Loading..
Loading..
Loading..
advertisement