ఇంకెప్పుడూ అలా పిలవద్దు: సాయిపల్లవి!

Sai Pallavi serious warning to anchor

Thu 02nd Jul 2020 11:20 AM
sai pallavi,serious warning,anchor,heroine,actress sai pallavi  ఇంకెప్పుడూ అలా పిలవద్దు: సాయిపల్లవి!
Sai Pallavi serious warning to anchor ఇంకెప్పుడూ అలా పిలవద్దు: సాయిపల్లవి!
Advertisement

సాయిపల్లవి మలయాళంలో నటించిన ప్రేమమ్ సినిమాతోనే పిచ్చ క్రేజ్ సంపాదించింది. ప్రేమమ్ సినిమా తర్వాత టాలీవుడ్, తమిళ సినిమాల్తో బాగా బిజీ అయ్యింది. కథ నచ్చడం, పాత్ర నచ్చితేనే సినిమా చెయ్యడం అనేది సాయిపల్లవి స్పెషల్. సాయిపల్లవి అందాలు ఆరబొయ్యడానికి.. గ్లామర్ షో చెయ్యడానికి, లిప్ లాక్ లకు దూరమంటుంది. ఆమె గనక అందాలు ఆరబోసి, లిప్ లాక్స్‌కి ఓకే చెబితే.. సాయిపల్లవికి స్టార్ హీరోల సినిమాలు క్యూ కట్టేవి. అయితే తాజాగా సాయిపల్లవికి ఓ యాంకర్ మీద బాగా కోపమొచ్చింది. కారణం ఆమెని మలయాళీ కుట్టి అన్నందుకు. అదేమిటి సాయిపల్లవి అంటే మలయాళం, మలయాళ హీరోయిన్ అంటే సాయిపల్లవే కదా.. ఇందులో కోప్పడడానికి ఏముంది అనిపించొచ్చు.

కానీ సాయిపల్లవిని సదరు యాంకర్ మలయాళీ అని పిలవడంతో సాయిపల్లవికి బాగా మండింది. తాను మలయాళీని కాదని స్పష్టం చేసిన సాయిపల్లవి తాను తమిళ్ అమ్మాయినని... కోయంబత్తూర్ లో పెరిగానని చెప్పింది. అసలు ఆ పేరు నాకు నచ్చదు, అలా పిలవద్దు అని యాంకర్ పై సీరియస్ అయిన సాయిపల్లవి ఇంకెప్పుడూ మలయాళీ అని పిలవొద్దని సూచించింధట. మరి చాలామంది సాయిపల్లవి నేటివ్ ప్లేస్ మలయాళమనే అనుకుంటున్నారు. కానీ సాయిపల్లవి తమిళ్ అని ఇప్పడే ఆమె మాటలతోనే తెలిసింది.

Sai Pallavi serious warning to anchor :

Sai Pallavi Super Punch To Anchor


Loading..
Loading..
Loading..
advertisement