ఆకాష్ మళ్లీ వస్తున్నాడు..!

Actor Akash is back details out

Wed 01st Jul 2020 01:51 PM
akash,back,hero akash,akash is back,a cube,andala rakshasudu  ఆకాష్ మళ్లీ వస్తున్నాడు..!
Actor Akash is back details out ఆకాష్ మళ్లీ వస్తున్నాడు..!
Advertisement

అసాధారణ విజయం సాధించిన ‘ఆనందం’తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన అందాల కథానాయకుడు ఆకాష్. ‘వసంతం, అందాల రాముడు, గోరింటాకు, నమో వేంకటేశ’ తదితర చిత్రాలతోనూ విశేషంగా ఆకట్టుకున్నారు. కెరీర్ పరంగా ఇటీవల కాస్తంత వెనకబడ్డ ఆకాష్ ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో.. పూర్వ వైభవం పొందే దిశగా అడుగులు వేస్తున్నారు. 

ఆకాష్ కన్నడలో నటించిన ‘జోతాయి.. జోతాయల్లీ’ అనే సీరియల్ అక్కడి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. ఇదే సీరియల్ తమిళంలో.. ‘నీతానై ఎంతన్ పొన్వసంతన్’ పేరుతో జీ-తమిళ్‌లో డైలీ సీరియల్‌గా ప్రసారమవుతూ... తమిళనాట ఆకాష్ పేరు మారుమ్రోగేలా చేస్తోంది. అంతేకాదు.. ఆకాష్ నటించిన అయిదు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. ‘ఏ-క్యూబ్’ పేరుతో ఒక మూవీ యాప్‌ను కూడా సిద్ధం చేసుకున్న ఆకాష్... ‘అందాల రాక్షసుడు’గా తెలుగు ప్రేక్షకులను మళ్లీ అలరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

Actor Akash is back details out:

Actor Akash is back with two Movies


Loading..
Loading..
Loading..
advertisement