‘బంగారు బుల్లోడు’ టీజర్ కూడా రెడీ!

Bangaru Bullodu Teaser Release Date Out

Tue 30th Jun 2020 01:01 PM
Advertisement
allari naresh,birthday special,bangaru bullodu,update,bangaru bullodu teaser,naandi  ‘బంగారు బుల్లోడు’ టీజర్ కూడా రెడీ!
Bangaru Bullodu Teaser Release Date Out ‘బంగారు బుల్లోడు’ టీజర్ కూడా రెడీ!
Advertisement

జూన్ 30 అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ‘నాంది’ సినిమా నుంచి ఎఫ్ఐఆర్ పేరుతో ఫ‌స్ట్ ఇంపాక్ట్ రివీల్ అంటూ ఒక చిన్న గ్లింప్స్‌ను విడుద‌ల చేస్తున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఆ సినిమాకు సంబంధించి విడుదలైన అల్లరి నరేష్ పోస్టర్‌తో ‘నాంది’ చాలా వైవిధ్యంగా ఉండబోతుందనేది అర్థమైంది. ఇక అల్లరోడి పుట్టినరోజు కానుకగా ఆయన నటించిన మరో చిత్రం నుంచి కూడా టీజర్ విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

 

నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘బంగారు బుల్లోడు’. ఇప్పుడీ టైటిల్‌తో అల్లరి నరేష్ ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఏ టీవీ సమర్పణలో ఏ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై పి.వి.గిరి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లరి నరేష్ నటిస్తోన్న 55వ చిత్రమిది. ఈ చిత్రం నుంచి జూన్ 30 అల్లరి నరేష్ బర్త్‌డే కానుకగా టీజర్‌ను విడుదల చేస్తున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. టీజర్‌ను జూన్ 30న సాయంత్రం 4గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన పూజా జవేరి హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం త్వరలో ఓటీటీలో విడుదలకానుందనే వార్తలు ఈ మధ్య వినిపిస్తున్నాయి.

Advertisement

Bangaru Bullodu Teaser Release Date Out:

Allari Naresh Birthday special: Bangaru Bullodu Update 

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement