Advertisementt

‘పుష్ప’ మీద బన్నీ ఫుల్ కాన్సన్‌ట్రేషన్!

Sun 28th Jun 2020 05:19 PM
pushpa,allu arjun,concentration,bunny,budgent,pushpa movie  ‘పుష్ప’ మీద బన్నీ ఫుల్ కాన్సన్‌ట్రేషన్!
Allu Arjun full concentration On Pushpa Movie ‘పుష్ప’ మీద బన్నీ ఫుల్ కాన్సన్‌ట్రేషన్!
Advertisement
Ads by CJ

సుకుమార్ ఎప్పుడెప్పుడు పుష్ప తో సెట్స్ మీదకెళదామా అని చూస్తున్నాడు. రంగస్థలం వచ్చి రెండున్నరేళ్లయినా.. నెక్స్ట్ మూవీ విషయంలో సుకుమార్ పడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదు. ఎలాగో బన్నీతో పుష్పని పాన్ ఇండియా మూవీగా మార్చిన సుకుమార్‌కి ఆ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి ఆడుగడుగునా అడ్డంకులే. కరోనా తగ్గాలి.. సినిమా సెట్స్ మీదకెళ్ళాలి. అయితే పుష్ప కి కరోనా ముందు భారీ బడ్జెట్ పెట్టి.. పాన్ ఇండియా క్రేజ్ తేవాలని మూవీ టీం నిర్మాతలు భావించారు. అయితే కరోనా వలన బడ్జెట్ లో మార్పులు అంటూ ఇప్పటికే చాలా సినిమాల బడ్జెట్ లలో కోతలు మొదలయ్యాయి.

తాజాగా పుష్ప లెక్కలు కూడా మారుతున్నాయని.. అందుకోసం అల్లు అర్జున్ కూడా రంగంలోకి దిగాడని అంటున్నారు. అయితే బన్నీ పుష్ప లెక్కల్లో వేళ్ళు పెట్టడానికి కారణం.. బన్నీ బంధువొకరు పుష్ప సినిమా నిర్మాతలలో ఒకరిగా ఉన్నారు. అందుకే బన్నీ కూడా పుష్ప బడ్జెట్ లెక్కల్లో కలగజేసుకుంటున్నాడట. అల వైకుంఠపురములో హిట్ తో పుష్ప కి భారీగా బడ్జెట్ పెట్టాలని... అందులోనూ పాన్ ఇండియా మూవీ కాబట్టి.. ఓ రేంజ్ బడ్జెట్ ఉండాలనే ప్లాన్‌లో మూవీ టీం ఉండగా.. ఇప్పుడు కరోనాతో పరిస్థితులు మారిపోబట్టి... పుష్పకి మరో బడ్జెట్ వేస్తున్నారట. అందులో బన్ని కూడా ఉండి.. ఎక్కెడెక్కడ బడ్జెట్ తగ్గించొచ్చో చెబుతున్నాడట. ఇప్పటివరకు షూటింగ్ మొదలు కాకపోవడం.. రిచ్ లొకేషన్స్ బదులు చిన్న చిన్న సెట్స్ తో అయినా.. లేదంటే లొకేషన్స్ మార్చడానికి వీలవుతుంది అని.. అదే గనక షూటింగ్ సగం అయ్యాక లొకేషన్స్ మార్చడం కానీ.. బడ్జెట్ తగ్గించడం కానీ జరిగేది కాదని.. ఇపుడు పుష్పకి షూటింగ్ మొదలు కాకపోవడమే ప్లస్ అంటున్నారు.

Allu Arjun full concentration On Pushpa Movie:

Pushpa Movie Latest Update

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ