సుశాంత్ చివరి చిత్రం ఓటీటీలోకే.. డేట్ వచ్చేసింది..

Thu 25th Jun 2020 12:40 PM
sushanth singh rajput,disney hotstar,dil bechara,sushanth last film,ott,ar rahman,sanjana sanghi,saif ali khan  సుశాంత్ చివరి చిత్రం ఓటీటీలోకే.. డేట్ వచ్చేసింది..
Sushanth last movie will be streaming on OTT.. సుశాంత్ చివరి చిత్రం ఓటీటీలోకే.. డేట్ వచ్చేసింది..

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం చిత్రపరిశ్రమని తీవ్ర అశాంతికి గురి చేసింది. దేశవ్యాప్తంగా సినీ అభిమానులకే కాదు సామాన్య జనాలకి కూడా పెద్ద షాకింగ్ లా అనిపించింది. గత కొన్ని రోజులుగా సుశాంత్ తీవ్ర మనోవేదనికి గురయ్యాడని, దానివల్లే ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఎమ్ ఎస్ ధోనీ అన్ టోల్డ్ స్టోరీ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న యంగ్ హీరో చివరి చిత్రమైన దిల్ బేచరా ఓటీటీలో రిలీజ్ కానుంది.

ముందుగా ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తామని వార్తలు వచ్చినపుడు సుశాంత్ అభిమానుల నుండు వ్యతిరేకత వచ్చింది. సుశాంత్ నటించిన చివరి చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయాలని, అక్కడే ఘనంగా నివాళి సమర్పిస్తామని తమ విన్నపాన్ని నిర్మాతలకి సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు. వారి విన్నపాన్ని వారు వినిపించుకున్నారో లేదో కానీ కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడడంతో ఓటిటీలోనే రిలీజ్ చేస్తున్నారు. జులై 24వ తేదీ నుండి ఈ సినిమా డిసీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవనుందట.

ఈ మేరకు డిస్నీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో సంజనా సంఘి హీరోయిన్ గా కనిపిస్తుండగా సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో నటించారు. ముఖేష్ చాబ్రా అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. 

Sushanth last movie will be streaming on OTT.. :

Sushanth last movie will be streaming on OTT..