పవన్ కళ్యాణ్ ఏపీ పరీక్షల రద్దు మీదున్న ఇంట్రెస్ట్ సినిమాల మీద లేనట్టుగా ఉంది. ఏపీ టెన్త్ పరీక్షల రద్దు కోసం ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు పవన్. కరోనా టైం లో పరీక్షల నిర్వహణ ప్రమాదకరం అంటూ పరీక్షల ఉద్యమం చేపట్టాడు. ఏపీ ప్రభుత్వం ఎలాగోలా 10 పరీక్షలు రద్దు చేసింది. దానితో ప్రభుత్వానికి కృతఙ్ఞతలు చెప్పిన పవన్ ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ని రద్దు చేయమంటూ మరో గళం ఎత్తాడు. పవన్ కి - ఎగ్జామ్స్ కి పడదేమో అంటూ పవన్ అంటే గిట్టని వారు సైటర్లు వేస్తున్నారు. అయితే రాజకీయాల మాట అటుంచి.. ప్రస్తుతం పవన్ సినిమాల విషయంలో ఎవరికీ ఫోన్‌లో దొరకడం లేదట.
ముందు వకీల్ సాబ్ పని చూద్దాం తర్వాతే మరేదన్న ప్రాజెక్ట్ అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ అటు వకీల్ సాబ్ టీం ఫోన్స్ కూడా ఎత్తడం లేదట. అందుకే ఇపుడు అందరూ పవన్ ఫోన్‌లో దొరకడం లేదు. పవన్ ఫోన్ నాట్ రీచబుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వకీల్ సాబ్‌ని ఎలాగైనా దిల్ రాజు దసరా బరిలో నిలపాలని చూస్తుంటే.. పవన్ మాత్రం నిర్మాతల ఫోన్స్‌కి రెస్పాండ్ అవడం లేదట. మరి రీ ఎంట్రీ అన్నప్పుడు సినిమాల మీద సినిమాలకు సైన్ చేసి నిర్మాతలను లాక్ చేసుకున్న పవన్ కళ్యాణ్‌కి ఇపుడు కరోనా భయం పట్టుకుంది.
అందుకే షూటింగ్స్ విషయంలో పెదవి విప్పడం లేదు అంటున్నారు. ముందు కరోనా ఉదృతి తగ్గాక వకీల్ సాబ్ సెట్స్ మీదకి వస్తా.. అది కూడా జులై లోనే అని చెప్పిన పవన్, జులై దగ్గరకొచ్చిన ఫోన్స్ లిఫ్ట్ చెయ్యడం లేదంటే.. మనోడికి అప్పుడే సినిమా సెట్స్ మీదకెళ్లే ఉద్దేశ్యం ఉండకపోవచ్చు. కరోనాతో పెట్టుకోవడమెందుకు.. అది తగ్గాక చూద్దాంలే అన్నట్టుగా ఉంది పవన్ ప్రవర్తన.