Advertisementt

షూటింగ్స్‌పై కీర్తి సురేష్ రియాక్షన్ ఇదే..!

Thu 18th Jun 2020 04:58 AM
keerthi suresh,shootings,tollywood,corona,heroine  షూటింగ్స్‌పై కీర్తి సురేష్ రియాక్షన్ ఇదే..!
Keerthi Suresh Reaction on Shootings షూటింగ్స్‌పై కీర్తి సురేష్ రియాక్షన్ ఇదే..!
Advertisement
Ads by CJ

కరోనా లాక్ డౌన్ ముగిసినా కరోనా ఉదృతి మాత్రం ఇంకా తగ్గలేదు. ప్రభుత్వం షూటింగ్స్ కి అనుమతులిచ్చినా ఇప్ప్పుడప్పుడే సెట్స్ మీదకెళ్లడానికి హీరోలెవరు సిద్ధంగా లేరు. రాజమౌళి RRR ట్రయిల్ షూట్ మొదలెట్టబోతున్నాడు. కానీ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంకా షూటింగ్ కి సిద్ధం కాలేదు. మరోపక్క మహేష్, ప్రభాస్, పవన్ ఇలా ఎవ్వరూ షూటింగ్ కోసం సిద్దమవడం లేదు. కరోనా తగ్గాలంటున్నారు. అవకాశాలు తక్కువగా ఉన్న హీరోయిన్స్ మాత్రం షూటింగ్స్ కోసం రెడీ అయ్యి ఎయిర్ పోర్ట్స్ లో దర్శనమిస్తుంటే పేరున్న హీరోయిన్స్ మరికొన్ని రోజులు ఆగితే బావుంటుంది అంటున్నారు. పెంగ్విన్ తో ఓటిటిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కీర్తి సురేష్ ఇప్పుడు కరోనా ఉదృతి తగ్గేవరకూ షూటింగ్ కి రాలేనని చెబుతుందట.

ఇప్పట్లో షూటింగ్స్ అంటే కష్టమే అంటుంది. ప్రస్తుతం కరోనాతో బ‌య‌ట పరిస్థితులు బాగాలేవు. ఇలాంటి స‌మ‌యంలో షూటింగులంటూ మనం కూడా రిస్క్ తీసుకోవ‌డం నాకు ఇష్టం లేదు. మ‌నం జాగ్ర‌త్త‌గా ఉన్నా... మన చుట్టు ప‌క్క‌ల‌వాళ్లంతా అదే జాగ్ర‌త్త‌లు పాటించాలి అనుకునైతే అది మన స్వార్ధం అవుతుంది. అందరూ జాగ్రత్తలు పాటించగలిగితే కరోనా ఉదృతి తగ్గుతుంది. అంతా తగ్గాకే షూటింగ్ చేస్తే బావుంటుంది. ప్రస్తుతం నేను షూటింగ్స్ కోసం మానసికంగా సిద్ధపడలేదు అంటుంది. అంతేకదా ఆరోగ్యంగా ఉంటేనే నాలుగు రాళ్లు సంపాదించేది. ఆరోగ్యం లేకపోతే డబ్బున్న వేస్ట్ కదా అది కీర్తి సురేష్ ఉద్దేశ్యం.

Keerthi Suresh Reaction on Shootings:

I am not Ready to Shootings says Keerthi Suresh

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ