Advertisementt

హిట్ సీక్వెల్ ని వదులుకున్న నాని..?

Tue 16th Jun 2020 04:06 PM
nani,hit,vishwak sen,shailesh kolanu,awe  హిట్ సీక్వెల్ ని వదులుకున్న నాని..?
Nani will not do a HIT sequel..? హిట్ సీక్వెల్ ని వదులుకున్న నాని..?
Advertisement
Ads by CJ

నేచురల్ స్టార్ నాని అ! సినిమాతో నిర్మాతగా మారాడు. వాల్ పోస్టర్ బ్యానర్లో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత తన బ్యానర్లో తెరకెక్కిన రెండవ చిత్రం హిట్. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఓ మోస్తారు విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా థియేటర్లలో ఉండగానే సీక్వెల్ ఉంటుందని వార్తలు వచ్చాయి.

ఆల్రెడీ దర్శకుడు శైలేష్ కొలను ఈ  సీక్వెల్ కోసం స్క్రిప్టుని సిద్ధం చేసాడట. అయితే ఈ సీక్వెల్ నిర్మించడానికి నాని సుముఖంగా లేనట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో అ! సినిమా సీక్వెల్ విషయంలోనూ ఇలాంటి వార్తలే వచ్చాయి. అ! సినిమా సీక్వెల్ రెడీ చేసినా కూడా నాని ఆసక్తి చూపించలేదట.

అలాగే ఇప్పుడు కూడా హిట్ సీక్వెల్ తీయడానికి రెడీగా లేడని అంటున్నారు.దాంతో ఈ సినిమా సీక్వెల్ మరో బ్యానర్ చేతిలోకి వెళ్లనుందట. ఈ విషయమై హిట్ దర్శకుడు కన్ఫర్మేషన్ ఇస్తాడేమో చూడాలి. ఏదైతేనేం హిట్ ఫస్ట్ కేస్ ద్వారా ప్రేక్షకులకి థ్రిల్ కి గురి చేసిన శైలేష్, సెకండ్ కేస్ ద్వారా అలాంటి అనుభూతినే ఇస్తాడేమో చూడాలి. హిట్ సినిమా సీక్వెల్ లోనూ విశ్వక్ సేన్ హీరోగా కనిపిస్తాడట. చేతిలో ఉన్న ఫాగల్ సినిమా కంప్లీట్ అయ్యాకే హిట్ సినిమా సీక్వెల్ లో పాల్గొంటాడని సమాచారం.

Nani will not do a HIT sequel..?:

Nani will not do a HIT sequel..?

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ