Advertisement
TDP Ads

ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ ఫిల్మ్ కోసం టైటిల్ రిజిస్టర్డ్!

Sat 13th Jun 2020 06:40 PM
ntr,prashant neel,two titles,nuclear,missile  ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ ఫిల్మ్ కోసం టైటిల్ రిజిస్టర్డ్!
Best Title for NTR and Prashant Neel’s Film ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ ఫిల్మ్ కోసం టైటిల్ రిజిస్టర్డ్!
Advertisement

ఎన్టీఆర్ రాజమౌళి RRR తరవాత త్రివిక్రమ్‌తో అయినను పోయిరావలె హస్తినకు(వర్కింగ్ టైటిల్) అనే టైటిల్ తో ఓ పొలిటికల్ బ్యాగ్డ్రాప్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో ఎన్టీఆర్ విదేశాల్లో పుట్టి పెరిగి అనుకోకుండా ఇండియా రాజకీయాల్లోకి అడుగుపెడతాడని.. ఇదే కథతో త్రివిక్రమ్ ఎన్టీఆర్ ని బిజినెస్ అండ్ పొలిటికల్ మ్యాన్ గా చూపించబోతున్నాడనే టాక్ ఉంది. ఇక త్రివిక్రమ్ తర్వాత ఎన్టీఆర్ కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చెయ్యబోతున్నాడు. ఈ మధ్యనే ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ సినిమా విషయంలో, రేడియేషన్, న్యూక్లియర్ అంటూ ప్రచారం జరగడంతో వాళ్ళ కాంబో ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది.

అయితే కెజిఎఫ్ సీక్వెల్ తరవాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కోసం ఓ కథ ప్రిపేర్ చేసి స్క్రిప్ట్ రెడీ చేస్తాడని.. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా పూర్తికాగానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకి షిఫ్ట్ అవుతాడట. అయితే ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబో మూవీ టైటిల్ విషయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని నూక్లియర్ ప్లాంట్ పక్కనే కూర్చుంటే ఎలా ఉంటుందో తనకు తెలిసిందంటూ సంబోధించడం, మైత్రి వారు రేడియేషన్ సూట్ రెడీనా అంటూ ప్రశాంత్ నీల్ ని సంబోదించడంతో... ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబో మూవీ కి రేడియేషన్, కాదు న్యూక్లియర్ అంటూ టైటిల్స్ పెట్టె అవకాశం ఉందని ప్రచారం జరిగింది. 

అయితే తాజాగా మరో పవర్ ఫుల్ టైటిల్ వినబడుతుంది. అది ఎన్టీఆర్ ఎనర్జికి సరిపోయేలా మిస్సైల్ అనే టైటిల్, అలాగే ‘నూక్లియర్’ అనే టైటిల్ ని మైత్రి వారు ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించినట్లుగా తెలుస్తుంది. ఇక నూక్లియర్, మిస్సైల్ టైటిల్స్‌ లో ఏదైనా అన్ని భాషలకి పర్ఫెక్ట్ గా ఉంటుంది అని ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ - మైత్రి వారు భావిస్తున్నారట.

Best Title for NTR and Prashant Neel’s Film:

2 titles registered NTR, Prashant Neel’s Film

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement