Advertisement

‘సర్కారు వారి పాట’ స్టోరీ ఇలా ఉంటుందా!?

Thu 04th Jun 2020 12:04 PM
super star mahesh,sarkari vari patta,story,mahesh-parasuram combo,tollywood,mahesh fans  ‘సర్కారు వారి పాట’ స్టోరీ ఇలా ఉంటుందా!?
Super Star Mahesh Sarkari Vari Patta Story Revealed! ‘సర్కారు వారి పాట’ స్టోరీ ఇలా ఉంటుందా!?
Advertisement

సూపర్ స్టార్ మహేశ్ బాబు- డైరెక్టర్ పరశురామ్ కాంబోలో వస్తున్న మూవీ ‘సర్కారు వారి పాట’. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అటు టైటిల్.. ఇటు మహేష్ లుక్ రెండింటికీ మంచి మార్కులు పడటంతో టాలీవుడ్‌లో రికార్డ్ సృష్టించడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే షూటింగ్ షురూ కానుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే.. సినిమా స్టోరీ ఇలా ఉంటుందట. స్టోరీ లైన్ ఇదేనట.. ఇదిగో హీరోయిన్ పాత్ర.. ఇదిగో హీరో పాత్ర అనేది ఆ అప్డేట్ సారాంశం. అసలు ఆ కథేంటో ఈ కథనంలో చూద్దాం.

ఇదీ కథ..!?

అసలు విషయానికొస్తే.. ‘సర్కారు వారి పాట’ కథ మొత్తం బ్యాంకుల చుట్టూ తిరుగుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదెలాగంటే.. బడాబాబులు స్కామ్స్ చేయడంతో ఈ క్రమంలో బ్యాంకు మేనేజర్‌గా ఉన్న మహేశ్ తండ్రి ఇబ్బందులు ఎదుర్కొంటాడట. దీంతో కుటుంబానికి ఎదురైన ఆర్థిక పరిస్థితుల రీత్యా ఆ బడాబాబుల భరతం పట్టేందుకు గాను మహేశ్ రంగంలోకి దిగుతాడట. ఈ క్రమంలోనో ఈ బడబాబుల్లో కింగ్ అయిన విలన్‌ కుమార్తె అయిన హీరోయిన్ తగులుతుందట. ఆమెకు కాసినోలో జూదం ఆడటం ఓ హాబీ అట. అలా హీరో- హీరోయిన్‌ల మధ్య వచ్చే కొన్ని కీలకమైన సన్నివేశాలు కాసినో నేపథ్యంలోనే జరుగుతాయని తెలుస్తోంది. ఆ బ్యూటీని లైన్‌లో పెట్టి తిన్నగా వాళ్ల నాన్నకు దగ్గరయ్యి ఆ టీమ్‌లో ఒక్కొక్కర్ని చంపుకుంటూ వెళ్తాడట. అలా ఫైనల్‌గా బ్యాంకులకు భారీ మొత్తంలో ఎగ్గొట్టిన అందర్నీ పట్టుకుని ప్రభుత్వానికి పట్టిస్తాడని టాక్ నడుస్తోంది. మొత్తం మీద చూస్తే ఇదో రివెంజ్ డ్రామా అని తాజా వ్యవహారాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

సెట్స్, హీరోయిన్ సంగతేంటి..!?

అయితే.. ఇదంతా మొదట కోలోంబో, బ్యాంకాక్ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ చేయాలని భావించినప్పటి ఇప్పట్లో ఆ పరిస్థితులు లేవు గనుక.. కాసినోలకు ఫేమస్‌ అయిన గోవాలోనే షూటింగ్ ప్రారంభించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఇందుకుగాను భారీ సెట్ నిర్మించాలనే ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు గోవా దాకా వెళ్లడం కూడా అవసరం లేదని రామోజీ ఫిల్మ్ సిటీలో కాసినో సెట్ వేయ‌డానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. కరోనా భ‌యాల నేప‌థ్యంలో షూటింగుల‌న్నీ హైద‌రాబాద్‌లోనే చేయాలని దర్శకనిర్మాతలు ఆలోచనలూ చేస్తున్నారట. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ సినిమాలో మహేశ్ సరసన పూజా హెగ్దే నటించబోతోందని ఇండస్ట్రీలో కోడై కూస్తోంది. మరి ఫైనల్‌గా మహేశ్ సరసన నటించే బ్యూటీగా ఎవర్ని ఎంచుకుంటారో.. జస్ట్ వెయిట్ అండ్ సీ.

Super Star Mahesh Sarkari Vari Patta Story Revealed!:

Super Star Mahesh Sarkari Vari Patta Story Revealed!  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement