‘ఆర్ఆర్ఆర్’‌ కోసం రూ. 18 కోట్ల విలేజ్ సెట్‌

Thu 04th Jun 2020 08:25 AM
rrr,village set,huge budget,ss rajamouli,jr ntr,ram charan  ‘ఆర్ఆర్ఆర్’‌ కోసం రూ. 18 కోట్ల విలేజ్ సెట్‌
RRR Set Costs a Bomb ‘ఆర్ఆర్ఆర్’‌ కోసం రూ. 18 కోట్ల విలేజ్ సెట్‌
Sponsored links

డైరెక్ట‌ర్ య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి అంటేనే భారీత‌నానికి కేరాఫ్ అడ్ర‌స్‌. త‌న ఊహ‌ల‌కు అనుగుణంగా వ‌చ్చేవ‌ర‌కు పాట కానీ, ఫైట్ కానీ, సీన్ కానీ.. ఆయ‌న రాజీప‌డ‌రు. ‘సింహాద్రి’ మూవీ నుంచి ఆయ‌నలో ఈ ధోర‌ణిని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. టాప్ హీరోల‌తోనే కాదు.. నితిన్‌తో చేసిన ‘సై’, సునీల్‌తో చేసిన ‘మ‌ర్యాద‌రామ‌న్న‌’, నానితో చేసిన ‘ఈగ’ సినిమాల్లోనూ ఆయ‌న ఈ భారీత‌నాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం మ‌నం చూశాం. ఇక ‘బాహుబ‌లి’ మూవీని ఆయ‌న ఏ స్థాయిలో రూపొందించాడో ప్ర‌పంచ‌మంతా చూసింది.

ఇప్పుడు ఇద్ద‌రు టాప్ స్టార్స్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్‌: రౌద్రం ర‌ణం రుధిరం’ మూవీ కోసం ఆయ‌న స‌న్నివేశాల‌కు మ‌రింత సాధికార‌త కోసం ట్రై చేస్తున్నారు. ఎంత‌గా అంటే గ్రామీణ నేప‌థ్యం ఉన్న స‌న్నివేశాల క‌ల్ప‌న కోసం ఆయ‌న భారీ స్థాయిలో గండిపేట ద‌గ్గ‌ర ఓ విలేజ్ సెట్‌ను వేయించారు. దీని కోసం నిర్మాత‌కు దాదాపు రూ. 18 కోట్ల వ్య‌యం అయ్యింద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చెప్పుకుంటున్నారు. ఇప్ప‌టికే ఈ సెట్‌లో ప‌లు స‌న్నివేశాలను రాజ‌మౌళి తీశారు. మ‌ళ్లీ షూటింగ్‌లు మొద‌లైతే మ‌రో నెల పాటు ఈ సెట్‌లోనే సీన్స్ తియ్య‌డానికి ఆయ‌న స‌న్నాహాలు చేస్తున్నారు.

కాగా ఈ సినిమా లేటెస్ట్ అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మే 20న ఆయ‌న‌కు చెందిన ఫ‌స్ట్ లుక్ కానీ, టీజ‌ర్ కానీ రిలీజ్ అవుతుంద‌ని ఎంత‌గానో ఎదురుచూసిన ఆయ‌న ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందడం మ‌నం చూశాం. త్వ‌ర‌లోనే వారిని ఆనందింప‌జేసేలా తార‌క్ క్యారెక్ట‌ర్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇవ్వాల‌ని రాజ‌మౌళి భావిస్తున్నాడు. మ‌రోవైపు ఈ సినిమా విడుద‌ల 2021 వేస‌వి సీజ‌న్‌కు మారింది. రిలీజ్ డేట్ విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇంకా ఒక నిర్ణ‌యానికి రాలేదు.

Sponsored links

RRR Set Costs a Bomb:

RRR Village Set with a Huge Budget

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019