కరోనా లాక్ డౌన్ సడలింపులు ఇప్పుడు సినిమా ప్రపంచాన్ని ఊపిరి తీసుకునేలా చేసింది. అన్ని చోట్ల కండిషన్స్ తో షూటింగ్స్ కి అనుమతులను ఇస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేసుకోవచ్చని చెప్పడమే కాదు... త్వరలోనే షూటింగ్స్ కి అనుమతులు వచ్చేలా కసరత్తులు చేస్తుంది. మరోపక్క మహారాష్ట్రలో కరోనా తీవ్రత విపరీతంగా ఉంటే.. అక్కడి ప్రభుత్వం బాలీవుడ్ మూవీ షూటింగ్స్ కి అనుమతి ఇచ్చింది. కాకపోతే సామాజిక దూరం పాటిస్తూ షూటింగ్ చేసుకోవాలని కండిషన్ పెట్టింది.
అంతేకాదు.. హగ్స్ కానీ, కిస్సులు కానీ లేకుండా అతి తక్కువ మందితో షూటింగ్ కి అనుమతులునిచ్చింది. అలాగే షూటింగ్ చేసే సెట్స్‌లో ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తుండాలి. అదే విధంగా నటీనటులు మేకప్‌మెన్‌లను పెట్టుకోకుండా సొంతంగానే మేకప్‌లు వేసుకోవాలి, అలాగే తమ ఫుడ్ ని తామే తెచ్చుకోవాలి. అయితే బాలీవుడ్ మూవీస్ అంటేనే హగ్స్, కిస్సులు, అందాల ఆరబోత. ఇవేమి లేకుండా సినిమానే లేదు. బాలీవుడ్ మూవీస్ లో అవి చాలా ముఖ్యం. పెళ్లి సన్నివేశాలు, గుమ్మిగూడి ఫైటింగ్ సీన్స్ కి అనుమతులు లేవు. మరో భౌతిక దూరం ఒకే కానీ.. హగ్గింగ్స్ కిస్సింగ్స్ లేకుండా షూటింగు అంటే.. మిగతా భాషకు ఓకేనేమో కానీ.. బాలీవుడ్‌కి చాలా కష్టం సుమీ.