మహేష్ సర్కారు వారి పాట.. లుక్ అదిరింది..

Sun 31st May 2020 04:24 AM
ssmb27,mahesh babu,sarkari vaari paata,parashuram,mythri movie makers   మహేష్ సర్కారు వారి పాట.. లుక్ అదిరింది..
Mahesh Sarkari vaari paata lokk revealed మహేష్ సర్కారు వారి పాట.. లుక్ అదిరింది..
Sponsored links

సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాతి చిత్రానికి సంబంధించిన సంధిగ్ధత నేటితో వీడిపోయింది. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట అనే టైటిల్ తో సినిమా ప్రకటన వచ్చేసింది. క్రిష్ణగారి పుట్టినరోజుని పురస్కరించుకుని మహేష్ తన సినిమా అప్డేట్ ఇచ్చేశాడు. ఈ ఫస్ట్ లుక్ లో మహేష్ మొహం కనిపించలేదు. కేవలం మెడ భాగం మాత్రమే కనిపించేలా, మెడపై ఒకరూపాయి నాణెం టాటూ వేసి ఉంది.

ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా కోసం మహేష్ తన హెయిర్ స్టైల్ మార్చుకున్నట్లు అనిపిస్తుంది. సైడ్ వ్యూ నుండి మహేష్ హెయిర్ స్టైల్ చాలా స్టైలిష్ గా కనిపించింది. చెవికి పోగు కూడా ఉంది. మెడ మీద రూపాయి టాటూ చూస్తుంటే, ఇదేదో సామాజిక సందేశాత్మక చిత్రంగా తోస్తుంది. గతంలో వచ్చిన అనేక పుకార్లని నిజం చేసేలా ఫస్ట్ లుక్ పోస్టర్ కనిపిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, మహేష్ సొంత నిర్మాణ సంస్థ అయిన జీఎమ్ బీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ రోజు సాయంత్రం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించనున్న మహేష్ ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు చెప్తాడేమో చూడాలి.

Sponsored links

Mahesh Sarkari vaari paata lokk revealed:

Mahesh Sarkaari paata look revealed

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019