అల్లు శిరీష్ బర్త్‌డే ఇలా జరుపుకున్నాడు

Sun 31st May 2020 04:22 AM
allu sirish,birthday celebrations,family and friends,hero allu sirish  అల్లు శిరీష్ బర్త్‌డే ఇలా జరుపుకున్నాడు
Allu Sirish Birthday celebrations with Family and Friends అల్లు శిరీష్ బర్త్‌డే ఇలా జరుపుకున్నాడు
Sponsored links

కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులతో పుట్టిన‌రోజు జ‌రుపుకున్న అల్లు శిరీష్

యంగ్ హీరో అల్లు శిరీష్ త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా కుటుంబ‌ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులుతో క‌లిసి కేక్ క‌ట్ చేశారు. క‌రోనా నేప‌థ్యంలో త‌న పుట్టిన రోజు వేడుక‌లకు దూరంగా ఉన్నారు శిరీష్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సతీమ‌ణి అల్లు స్నేహా రెడ్డి స్వ‌యంగా త‌యారు చేసిన కేక్ ని శిరీష్ క‌ట్ చేయ‌డం విశేషం. అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ట్విట్టర్ ద్వారా శిరీష్ కి శుభాకాంక్షలు తెలిపారు. యూ ఆల్వేస్ బీ మై బెస్ట్ బేబీ ఇన్ థిస్ వరల్డ్ అంటూ ట్వీట్ చేశారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. 

ఇక వైవిధ్య‌మైన క‌థ‌ల్లో న‌టిస్తూ త‌న‌దైన శైలిలో ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేస్తున్నారు అల్లు శిరీష్. కొత్త జంట‌, శ్రీర‌స్తు శుభ‌మస్తు, ఒక్క క్ష‌ణం వంటి సూప‌ర్ హిట్ సినిమాలు శిరీష్ ఖాతాలో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అల్లు శిరీష్ త‌దుప‌రి సినిమాపై సినీ అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన కీల‌క‌ ప్ర‌క‌ట‌నతో పాటు మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల కాబోతున్నాయి.

Sponsored links

Allu Sirish Birthday celebrations with Family and Friends:

Allu Sirish Birthday celebrations details

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019