డైరెక్టర్స్‌పై ఒత్తిడి.. ఏం, ఎలా చేయాలి?

Sat 30th May 2020 02:24 PM
corona effect,film directors,stress,ss rajamouli,trivikram,koratala siva,puri jagan,tollywood  డైరెక్టర్స్‌పై ఒత్తిడి.. ఏం, ఎలా చేయాలి?
Corona Effect: Film directors in Stress డైరెక్టర్స్‌పై ఒత్తిడి.. ఏం, ఎలా చేయాలి?
Sponsored links

కరోనా లాక్ డౌన్ తో భారీ బడ్జెట్ సినిమాల షూటింగ్స్ మొత్తం డోలాయమానంలో పడ్డాయి. ప్రభుత్వాలు షూటింగ్స్ కి అనుమతులివ్వడానికి రెడీ అవుతున్నప్పటికీ.. భారీ బడ్జెట్ సినిమాల షూటింగ్స్ విషయంలో స్టార్ డైరెక్టర్స్ అయిన రాజమౌళి, కొరటాల శివ లాంటి డైరెక్టర్స్ బాగా ఒత్తిడికి లోనవుతున్నట్టుగా ఫిలింనగర్ టాక్. ఒకపక్క షూటింగ్ సమయంలో వందలాది మంది టెక్నీకల్ సిబ్బంది పాల్గొనకూడదు, మరోపక్క బడ్జెట్ కంట్రోల్. ఈ విషయాలతో ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియక రాజమౌళి దగ్గర నుండి కొరటాల, పూరి, త్రివిక్రమ్ ఇలా చాలామంది దర్శకులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లుగా సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం.

షూటింగ్స్‌కి అనుమతులు కొద్దిగా లేటయినా పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోమని చెప్పింది ప్రభుత్వం. అయినప్పటికీ.. ఇప్పటివరకూ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు కాలేదు. రాజమౌళి ఎలాగైనా RRR ని సెట్స్ మీదకి తీసుకెళ్లి ఎలాగోలా షూటింగ్ చెయ్యాలని భావిస్తున్నాడు కానీ.. అది ఎలా వర్కౌట్ అవుతుందో తెలియక తికమక పడుతున్నాడు. మరోపక్క కొరటాల శివ ఆచార్య షూటింగ్ విషయమూ అంతే. ఇక పూరి జగన్, విజయ్ ఫైటర్ సినిమా విషయంలో పెట్టుబడి పెట్టి ఉన్నాడు. అక్కడ ముంబైలో కరోనా కల్లోలం మాములుగా లేదు. ఇప్పట్లో అక్కడ షూటింగ్ అంటే అవదు. ఆచార్య కోసం కొరటాల రెండేళ్లు వెయిటింగ్. రాజమౌళి కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ రెండేళ్లుగా కష్టపడుతున్నారు. ఇలా కరోనా వలన అందరూ ఒత్తిడికి లోనవుతున్నట్లుగా పక్కా సమాచారం.

Sponsored links

Corona Effect: Film directors in Stress :

Film Directors waiting for Shootings but.. searching for Routes

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019