సోషల్ మీడియా దెబ్బకి హీరోయిన్లకు కోల్డ్ వార్!

Sat 30th May 2020 02:01 PM
samantha fans,pooja hegde fans,fight,samantha,social media,pooja hegde  సోషల్ మీడియా దెబ్బకి హీరోయిన్లకు కోల్డ్ వార్!
Social Media Effect on Samantha and Pooja Hegde సోషల్ మీడియా దెబ్బకి హీరోయిన్లకు కోల్డ్ వార్!
Sponsored links

ప్రస్తుతం టాలీవుడ్‌లో బాలయ్య చేసిన హాట్ కామెంట్స్‌కి సి కళ్యాణ్, నాగబాబు లాంటి సినీ పెద్దలు కౌంటర్లు ఇస్తుంటే... ఇండస్ట్రీ మొత్తం వేడి వేడిగా ఉంది. ఇలాంటి టైం లోనే ఇద్దరు హీరోయిన్స్ ఫ్యాన్స్ మధ్యన చిచ్చు రేగింది. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ పొజిషన్‌కి చేరువలో ఉన్న పూజా హెగ్డే తన ఇన్‌స్టాగ్రమ్ లో సమంత పై చేసిన కామెంట్స్ సంచలనం అయ్యాయి. పెళ్లి తర్వాత కూడా క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత ని పూజ హెగ్డే తన ట్విట్టర్ లో మజిలీ సినిమాలోని సమంత స్క్రీన్ షాట్ చూపిస్తూ అందులో సమంత అంత అందంగా ఏం లేదని.. అలా ఉంటుందని కూడా తాను అనుకోవడం లేదంటూ పోస్ట్ చెయ్యడంతో సమంత అభిమానులు రెచ్చిపోయి పూజా హెగ్డే పై పడ్డారు.

అయితే ఇదంతా చూసిన పూజ హెగ్డే మిడ్ నైట్ టైం లో నా సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయ్యింది అని.. తన టెక్నీకల్ టీం దాన్ని సరిచేస్తున్నారని, కాబట్టి ఎవరూ నా అకౌంట్ ని ఫాలో అయ్యి పర్సనల్ పోస్ట్ లు పెట్టొద్దు అంటూ రిక్వెస్ట్ చేసింది. అలాగే మరో గంటలో తన సోషల్ మీడియా టీం తన అకౌంట్ ని హ్యాకర్స్ నుండి కాపాడింది అని.. చెప్పింది కానీ.. ఎక్కడా సమంత పేరుని ప్రస్తావించడం కానీ, తానూ సమంతపై ఎలాంటి పోస్ట్ పెట్టలేదని మాట్లాడకపోయే సరికి సమంత అభిమానులు మరింతగా రెచ్చిపోయారు. 

అంతేకాకుండాసమంత ఫ్రెండ్స్ నందిని రెడ్డి, చిన్మయి సమంత ని ఉద్దేశించి.. వాట్ ద హ్యాక్.. లవ్ యు టూ..., ప్లీస్ లవ్ మి టూ.. ఐయామ్ నీడీ.. పి.ఎస్: మై అకౌంట్ ఈజ్ నాట్ హ్యాక్డ్ అంటూ ట్వీట్ చెయ్యడం దానికి సమంత కూడా జోక్స్ ఆన్ హ్యాకింగ్ ఆర్ సస్పెండెడ్ అంటిల్ ఫర్దర్ నోటీస్ కౌంటర్ వెయ్యడంతో ఇవన్నీ పూజ హెగ్డే ని ఉద్దేశించి చేసినవే అంటూ పూజా ఫ్యాన్స్ సమంత మీద ఫైర్ అవుతున్నారు. మరి పూజా క్షమాపణ చెప్పాలని సమంత ఫ్యాన్స్, కాదు సమంత క్షమాపణ చెప్పాలని పూజా ఫాన్స్ సోషల్ మీడియాని ఆడేసుకుంటున్నారు. 

Sponsored links

Social Media Effect on Samantha and Pooja Hegde:

Samantha fans vs Pooja Hegde Fans

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019