బ్రిటన్ భామతో ఎన్టీఆర్ రొమాన్స్ అదిరిపోతుందట..

Fri 29th May 2020 03:08 PM
rrr,rajamouli,ntr,ramcharan,olivia morris  బ్రిటన్ భామతో ఎన్టీఆర్ రొమాన్స్ అదిరిపోతుందట..
NTR romancing with Britain girl.. బ్రిటన్ భామతో ఎన్టీఆర్ రొమాన్స్ అదిరిపోతుందట..
Sponsored links

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ చేస్తుండగా, ఎన్టీఆర్ కి జోడీగా బ్రిటన్ భామ ఒలివియా మోరిస్ కనిపించనుంది.

డెభ్బై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చిత్రంలో ఇప్పటివరకు హీరోయిన్లు పాల్గొనలేదు. లాక్డౌన్ ముగిసిన అనంతరం షూటింగ్ ప్రారంభం అవగానే హీరోయిన్లపై చిత్రీకరణ జరపనున్నారట. అయితే తాజాగా ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది. రామ్ చరణ్, ఆలియా భట్ ల మధ్య మంచి రొమాంటిక్ సాంగ్ ఉండనుందని తెలిసిందే. అలాగే ఎన్టీఆర్, ఒలివియా మధ్య కూడా రొమాంటిక్ సాంగ్ ఉండనుందట.

సినిమాల్లోని పాటలన్నింటిలోకి ఈ పాట ప్రత్యేకంగా నిలుస్తుందని అంటున్నారు. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ తెల్లతోలు పాపతో ప్రేమలో పడతాడని, ఆ టైమ్ లో ఈ పాట ఉంటుందని అది సినిమాకే హైలైట్ గా నిలవనుందని చెబుతున్నారు. అదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఎలా ఉంటాడో చూడాలని ఆశపడుతున్నారు. వారి కోరికని రాజమౌళి ఎప్పుడు తీరుస్తాడో..!

Sponsored links

NTR romancing with Britain girl..:

NTR romance with braitain girl

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019