తన స్టాఫ్‌ని కూడా ఆటపట్టిస్తున్న రష్మిక!

Rashmika Mandanna cutting her staff salaries

Fri 29th May 2020 03:57 PM
Advertisement
rashmika mandanna,staff,palying,funny,salary,heroine  తన స్టాఫ్‌ని కూడా ఆటపట్టిస్తున్న రష్మిక!
Rashmika Mandanna cutting her staff salaries తన స్టాఫ్‌ని కూడా ఆటపట్టిస్తున్న రష్మిక!
Advertisement

వరస హిట్స్‌తో ఈ ఏడాది లక్కీ హీరోయిన్ గా మారిన రష్మికకి పారితోషకాల పరంగా బాగానే గిడుతున్నాయి. మరి కరోనా లాక్ డౌన్ సమయంలో షూటింగ్స్ లేకపోతే రష్మిక ఇలా తన స్టాఫ్‌కి జీతాల కోత వేస్తుందా? అనే అనుమానం వస్తుంది. అయితే రష్మిక తన స్టాఫ్ కి డబ్బు లేక జీతాలు కోత పెట్టలేదు. తన గురించి పూర్తిగా వారు తెలుసుకోలేకపోయినందుకు రష్మిక తన స్టాఫ్ కి జీతాలు కోత పెట్టిందట. ఈ విషయాన్నీ రష్మిక ఫన్నీగా చెబుతుంది. మరి రష్మిక చెప్పేది మీరు ఓ లుక్కెయ్యండి. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే జిమ్ చేసి వంటలు నేర్చుకున్న రష్మిక అభిమానులతో చిట్ చాట్ చేస్తూ బిజీగానే ఉంది.

అయితే ఎప్పటిలాగే సోషల్ మీడియాలో రష్మిక ఓ కాంటెస్ట్ పెట్టింది. అది కూడా తన గురించి ఎవరికీ బాగా తెలుసో చెప్పమంటూ ఆ కాంటెస్ట్ రన్ చేసింది. అయితే కాంటెస్ట్ లో రష్మిక తనకు కావాల్సిన వాళ్లతో పాటుగా తన స్టాఫ్ ని ఇన్వాల్వ్ చేసింది. వాళ్లందరికీ టెస్ట్ పెట్టిన రష్మిక తన గురించి తెలిసినవాటిలో టిక్ పెట్టమని సూచించింది. అయితే రష్మిక పెట్టిన టెస్ట్ లో అందరూ అంటే తన స్టాఫ్ తో సహా సుద్ద తప్పులు చెప్పారు. రష్మిక గురించి కనీసం తన స్టాఫ్ కూడా ఉన్నది ఉన్నట్లుగా చెప్పలేకపోయారట. తన గురించి ఎవరికీ ఏం తెలియదని, ఆఖరుకి నా స్టాఫ్ కి కూడా నా గురించి తెలియదు.. అందుకే మీ జీతాల్లో కోత పెడుతున్న పోండి అంటూ తన స్టాఫ్ ని ఫన్నీగా ఏడిపించేసింది రష్మిక.

Advertisement

Rashmika Mandanna cutting her staff salaries:

Rashmika Mandanna Playing with her Staff

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement