మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్న బాహుబలి..

Bahubali created another new record..

Thu 28th May 2020 02:00 PM
Advertisement
bahubali 2,russia in india,rajamouli,,prabhas,rana,anushka  మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్న బాహుబలి..
Bahubali created another new record.. మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్న బాహుబలి..
Advertisement

తెలుగు సినిమా చరిత్రలో బాహుబలి స్థానం ప్రత్యేకం. అప్పటి వరకూ ఎవరూ ఊహించడానికి కూడా సాహసించని సమయంలో దర్శకధీరుడు కలలు కన్న స్వప్నం బాహుబలి రూపంలో ప్రపంచ ముందుకు తీసుకువచ్చాడు. భారతదేశ చరిత్రలోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికంతటా పాకేలా చేసింది. రాజమౌళి మదిలో మెదిలిన దృశ్యకావ్యం భారతీయ చలన చిత్ర చరిత్రలో ఓ సువర్ణాధ్యాయంగా నిలిచిపోయింది.

బాహుబలి ఇప్పటివరకూ ఎన్నో ఘనతలు సాధించింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శితమైంది. అక్కడ ప్రదర్శితమైన మొట్టమొదటి నాన్ ఇంగ్లీష్ చిత్రంగా రికార్డుకెక్కింది. తాజాగా ఈ సినిమా మరో రికార్డుని క్రియేట్ చేసింది. రష్యా టెలివిజన్ లో ప్రదర్శితమైన మొదటి తెలుగు సినిమాగా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. రష్యన్ వాయిస్ ఓవర్ తో రష్యాలో ప్రదర్శించబడ్డ భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది.

ఈ విషయాన్ని రష్యా ఇన్ ఇండియా వారు అధికారికంగా తెలియజేశారు. జక్కన్న తెరకెక్కించిన మాహాద్భుతం ప్రపంచ జనాలని అలరిస్తుందంటే అంతకంటే గొప్పేం ఉంటుంది.

 

click here for tweet

Advertisement

Bahubali created another new record..:

Bahubali created another new record

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement