కమల్‌తో డేటింగ్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన నటి

Wed 27th May 2020 06:22 PM
pooja kumar,relationship,rumours,kamal hasan  కమల్‌తో డేటింగ్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన నటి
Pooja Kumar clears the air on her relationship rumours with kamal కమల్‌తో డేటింగ్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన నటి
Sponsored links

విలక్షణ నటుడు, లోక నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్.. హీరోయిన్ పూజా కుమార్‌తో డేటింగ్‌లో ఉన్నాడని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు.. ఇదిగో ఈ ఫొటోనే సాక్ష్యం అని.. ఆ బ్యూటీకి దగ్గరుండి మరీ కమలే వరుసగా తన సినిమాల్లో అవకాశాలు కల్పించారని కూడా నెట్టింట్లో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో అప్పట్లో.. రిలేషన్ షిప్స్‌తో వ్యవహారాలు రోడ్డు మీదికొచ్చి.. నానా తంటాలు పడ్డ ఆయన మళ్లీ ఇలా చేస్తున్నారేంటి..? అందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఈ వార్తలపై అటు కమల్ గానీ.. ఇటు పూజా కానీ స్పందించకపోవడంతో ఇవన్నీ నిజమేనని అందరూ భావించారు. అయితే ఎట్టకేలకు ఈ వ్యవహారంపై పూజా కుమార్ ఫుల్ క్లారిటీ ఇచ్చుకుంది.

కమల్‌తో డేటింగ్ వార్తలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని.. అసలు ఇలాంటి వార్తలు ఎందుకు రాస్తున్నారో అంటూ ఆమె ఒకింత ఆగ్రహానికి లోనయ్యింది. ‘చాలా కాలం నుంచి కమల్ సార్.. ఆయన కుటుంబం నాకు పరిచయం. కమల్ సోదరుడు ఓ నిర్మాత. కమల్ హాసన్ కుమార్తెలు శ్రుతి హాసన్, అక్షర హాసన్‌లతో అనుబంధం ఉంది. అందువల్ల వారి ఇంట్లో ఫంక్షన్లకు హాజరవుతుంటా. అంతేకానీ కమల్ సార్‌తో డేటింగ్ అనేది కేవలం వదంతులు మాత్రమే’ అని వివరంగా చెప్పుకొచ్చింది. 

ఈ సందర్భంగా.. కమల్‌తో కలిసి ‘తలైవాన్ ఇరుక్కిరన్’లో పూజ నటిస్తున్నారా..? అని ప్రశ్నించగా.. ఇప్పటివరకైతే తనను ఈ సినిమా కోసం ఎవరు సంప్రదించలేదన్నారు. అంతేకాదు.. సినిమా విషయంలోనూ వదంతులు ప్రచారంలో ఉన్నాయని చెప్పింది. ఇప్పటికే కమల్‌తో కలిసి ‘విశ్వరూపం1’, ‘విశ్వరూపం 2’, ‘ఉత్తమ విల‌న్’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. పూజాకు కమలే దగ్గరుండి అవకాశం ఇప్పించారని కూడా వార్తలు వచ్చాయి. మొత్తానికి చూస్తే ఆలస్యంగా అయినా పూజా డేటింగ్ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చేసుకుందన్న మాట.

 

కమల్ ఆ హీరోయిన్‌తో రిలేష‌న్‌లో ఉన్నాడా!?

Sponsored links

Pooja Kumar clears the air on her relationship rumours with kamal:

Pooja Kumar clears the air on her relationship rumours with kamal  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019