బన్నీ బాలీవుడ్ ప్లానింగ్ ఛేంజేస్ చూశారా..!

Tue 26th May 2020 02:40 PM
allu arjun,bollywood,planning,bollywood films,bollywood fans,star heroes,praises  బన్నీ బాలీవుడ్ ప్లానింగ్ ఛేంజేస్ చూశారా..!
Allu Arjun Bollywood Planning Superb బన్నీ బాలీవుడ్ ప్లానింగ్ ఛేంజేస్ చూశారా..!
Sponsored links

అల్లు అర్జున్ ఇంతవరకు పాన్ ఇండియా మూవీస్ చెయ్యలేదు కాబట్టి.. బాలీవుడ్ విషయాలను పట్టించుకోలేదు కానీ.. సుకుమార్ తో పుష్ప సినిమాని పాన్ ఇండియా లెవల్ కి తీసుకెళ్లడంతో... ఇప్పుడు అల్లు అర్జున్ బాలీవుడ్ పై బాగా ఇంట్రెస్ట్ చూపుతున్నాడు. సినిమా మొదలెట్టినప్పటి నుండి బాలీవుడ్ ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకునే ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఎక్కువగా బాలీవుడ్ మీడియాకి, ముంబై కి అందుబాటులో ఉంటున్నాడు. మామూలుగానే బాలీవుడ్ యూట్యూబ్ ని షేక్ చేసే అల్లు అర్జున్ ఈసారి పుష్ప తో బాలీవుడ్ లో అంచనాలు పెంచేసేలా కనబడుతున్నాడు. ఇక తాజాగా బాలీవుడ్ మూవీస్ లో మూడు సినిమాలంటే తనకి చాలా ఇష్టమంటూ అక్కడి స్టార్ హీరోల అభిమానులకి గాలం వేస్తున్నాడు.

తనకి బాలీవుడ్ లో విపరీతంగా నచ్చిన సినిమాల్లో ఓ మూడు సినిమాలు స్పెషల్ అంటున్నాడు. జో జీతా వహి సికిందర్ సినిమాని ఏకంగా 20 సార్లు చూశానని.. ఆ సినిమా అంటే చాలా ఇష్టమని చెబుతున్నాడు అల్లు అర్జున్. అలాగే షారుక్ ఖాన్ నటించిన దిల్ వాలే దుల్హనియా లే జాయింగే  కూడా వ్యక్తిగతంగా తన మనసుని తాకిన సినిమా అని అందుకే ఆ సినిమాని కూడా పదే పదే చూశానని చెబుతున్నాడు. ఇక మూడో సినిమా రణ్వీర్ సింగ్ తాజా బ్లాక్ బస్టర్ గల్లీ బాయ్ సినిమా అంటే చాలా ఇష్టం అని చెబుతున్నాడు. వ్యక్తిగతంగా ఈ మూడు సినిమాలు తనని చాలా ఆకట్టుకున్నాయని చెబుతున్నాడు. మరి ఇలా అల్లు అర్జున్ చెప్పడం ఆయా హీరోల అభిమానులకు హ్యాపీనే. సో అల్లు అర్జున్ పుష్ప ని ఈ అభిమానులంతా మోయడం ఖాయం. అందుకే అల్లు అర్జున్ బాలీవుడ్ విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకువెళుతున్నాడు.

Sponsored links

Allu Arjun Bollywood Planning Superb:

Allu Arjun Praises 3 Bollywood Films

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019